డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌పై ఆకర్షనీయమైన ఆఫర్లు
నిస్సాన్‌కు చెందిన పురాతన కార్ బ్రాండ్ డాట్సన్, ఈ ఏడాది మార్చ్ నెలలో కేవలం రూ. 3.12 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే భారత్‌లో విడుదల తమ 'గో' హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెటింగ్ చేసుకునేందుకు కంపెనీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే, డాట్సన్ గో కారు కోసం కంపెనీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటింది. ప్రస్తుత పండుగ సీజన్‌ను పురస్కరించుకొని డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌పై కంపెనీ మొత్తం రూ.38,000 విలువైన ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది.
ఇది కూడా చదవండి: డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ
ఈ ఆఫర్‌లో భాగంగా, రూ.20,000ల ఎక్సేంజ్ బోనస్, రూ.4,000ల ఇన్సూరెన్స్ సపోర్ట్, రూ.4,000ల ఉచిత అదనపు వారంటీ మరియు రూ.10,000ల అదనపు డిస్కౌంట్ (మొత్తంగా రూ.38,000ల విలువైన ప్రయోజనాల)ను డాట్సన్ అందిస్తోంది. ఈ ఆఫర్లు డాట్సన్ డి, డి1 మరియు ఏ వేరియంట్లపై అందుబాటులో ఉంటాయి మరియు ఈ ఆఫర్ అక్టోబర్ 31, 2014 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని నిస్సాన్ డీలరును సంప్రదించండి.

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ విషయానికి వస్తే.. నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేసిన 'వి' (V) ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొనే ఈ డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌ను కూడా తయారు చేశారు. నిస్సాన్ మైక్రాలో అమర్చిన 1.2 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌నే డాట్సన్ గో కారులోను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 106 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో లభిస్తుంది.
డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ లీటరుకు 20.63 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) కంపెనీ పేర్కొంది. ఈ విభాగంలో కెల్లా మొదటిసారిగా డాట్సన్ తమ గో హ్యాచ్‌బ్యాక్ కోసం రోడ్-సైడ్ అసిస్టెన్స్‌ను మరియు 2 ఏళ్ల అపరిమిత కిలోమీటర్ల వారంటీని ఆఫర్ చేస్తోంది. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ మొత్తం మూడు వేరియంట్లు, నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో (వైట్, సిల్వర్, స్కై బ్లూ, రూబీ రెడ్) లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








