రెనోతో డాట్సన్ క్రాస్ బ్యాడ్జింగ్ ఉండదు: నిస్సాన్
నిస్సాన్‌కు బడ్జెట్ కార్ బ్రాండ్ డాట్సన్ ఇటీవలే తమ తొలి కారు గో హ్యాచ్‌బ్యాక్‌ను భారత్‌లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. నిస్సాన్-రెనో కంపెనీలు భాగస్వామ్యాన్ని కలిగి ఉన్న నేపథ్యంలో, డాట్సన్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకొని రెనో కార్లు, అలాగే రెనో ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకొని డాట్సన్ కార్లు (మైక్రా-పల్స్, సన్నీ-స్కాలా, డస్టర్-టెర్రానో మోడళ్ల మాదిరిగా) తయారు చేయబోమని డాట్సన్ మాతృ సంస్థ నిస్సాన్ ప్రకటించింది.
నిస్సాన్ ఇండియా బిజినెస్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ రఘవంశి మాట్లాడుతూ.. రెనోతో డాట్సన్ తమ వాహనాలను క్రాస్ బ్యాడ్జ్ చేయబోదని అలాగే రెనో కూడా తమ వాహనాలను డాట్సన్‌తో క్రాస్ బ్యాడ్జ్ చేయబోదని స్పష్టం చేశారు.

నిస్సాన్, రెనో కంపెనలు ఇప్పటికే తమ మైక్రా/పల్స్, సన్న/స్కాలా మరియు టెర్రానో/డస్టర్ మోడళ్ల విషయంలో క్రాస్ బ్యాడ్జింగ్ విధానాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసినదే. క్రాస్ బ్యాడ్జింగ్ అంటే, ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఉత్పత్తిని కొద్దిపాటి చేర్పులు చేసి, రెండు వేర్వేరు మోడళ్లుగా విక్రయించడం. డాట్సన్ కూడా నిస్సాన్ బ్రాండ్ కావటంతో, ఈ బ్రాండ్ విషయంలో కూడా క్రాస్ బ్యాడ్జింగ్ జరగవచ్చనే పుకార్లకు నిస్సాన్ ఫుల్‌స్టాప్ పెట్టింది.
రెనో-నిస్సాన్ కంపెనీలు భారత్‌లో సంయుక్తంగా కలిసి పనిచేస్తూ, చెన్నైలో ఓ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే. ఈ ప్లాంట్ సామర్థ్యం సాలీనా 4 లక్షల యూనిట్లు.


Click it and Unblock the Notifications








