దేశ రాజధాని రోడ్లపై జీబీ ఎలక్ట్రిక్ రిక్షాలు
దేశ రాజధాని రోడ్లపై త్వరలోనే జీబీ (Zbee) ఎలక్ట్రిక్ రిక్షాలు సంచరించనున్నాయి. స్వీడన్‌కు చెందిన ఓ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ, ఇండియాకు చెందిన మరో కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఈ-రిక్షాలను ఢిల్లీలో ప్రవేశపెట్టనున్నారు.
ఆటోమొబైల్ యాక్ససరీలపై 75 శాతం తగ్గింపు, త్వరపడండి!
ఇప్పటికే, ఢిల్లీ రోడ్లపై ఎలక్ట్రిక్ రిక్షాలు ఉన్నప్పటికీ, తాము కొత్తగా ప్రవేశపెట్టబోయే జీబీ ఎలక్ట్రిక్ రిక్షాలు ప్రస్తుత ఈ-రిక్షాల కన్నా ఎన్నో రెట్లు అధునాతమైనవని, పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించబోవని వాటి నిర్వాహకులు చెబుతున్నారు.

జీబీ ఈ-రిక్షాలను ఫరీదాబాద్‌లో ఉత్పత్తి చేయనున్నారు. ప్రారంభంలో భాగంగా, 25 ఈ-రిక్షాలను ఢిల్లీ రోడ్లపై ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు. వీటిని పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఈ జేవీ ఎదురుచూస్తోంది.
ఈ ఎలక్ట్రిక్ రిక్షాలు క్రాష్ టెస్టుకు వెళ్లనున్నాయి. మానేసర్ వద్ద ఐక్యాట్ వాహన టెస్టింగ్ ఏజెన్సీ వీటి సామర్థ్యాన్ని పరీక్షించనుంది. తమకు ఇప్పటికే గుర్గావ్, ముంబై, చెన్నై, పూనే నగరాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయని క్లీన్ మోషన్ సీఈఓ గోరాన్ ఫోకెస్సన్ తెలిపారు.
జీబీ ఈ-రిక్షాలలో డ్రైవర్ మరియు ప్యాసింజర్ల సేఫ్టీ కోసం సీట్ బెల్టులు కూడా ఉంటాయి. ఇందులో మొత్తం ముగ్గురు ప్రయాణీకులు సౌకర్యంగా ప్రయాణించవచ్చు. ఇవి లిథియం అయాన్ బ్యాటరీలతో నడుస్తాయి. వీటి గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లు. ప్రతి 100 కిలోమీటర్లకు గాను ఇది 4 కిలోవాట్ల విద్యుత్‌ను వినియోగించుకుంటుంది.


Click it and Unblock the Notifications








