మళ్లీ పెరిగిన డీజిల్ ధర; లీటరుపై 50 పైసల పెంపు
డీజిల్ ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. డీజిల్ ధరలపై క్రమంగా తమ నియంత్రణను ఎత్తివేసే లక్ష్యంలో భాగంగా, ప్రతినెల డీజిల్‌పై 50 పైసల చొప్పున పెంచాలని కంపెనీ నిర్ణయించిన సంగతి తెలిసినదే. తాజాగా లీటరు డీజిల్‌పై 50 పైసల చొప్పున పెంచుతున్నట్లు (స్థానిక పన్నులు కలుపుకోకుండా) చమురు కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన డీజిల్ ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి.
అయితే, పెట్రోలు ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాగా.. జనవరి 3, 2014వ తేదీన పన్నులు మినహా డీజిల్ ధరను లీటరుకు 70 పైసలు, పెట్రోలు ధరను లీటరుకు 50 పైసల చొప్పున పెంచిన సంగతి తెలిసినదే. ఇంధన నష్టాలను పూర్తిగా తొలగే వరకు, మార్కెట్ నిర్ధారిత ధరలు అమలయ్యే వరకు ప్రతి నెలా ధరలను 50 పైసల వరకు పెంచాలని 2013 జనవరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తాజా పెంపుతో డీజిల్ ధర రూ.59.83 లకు చేరుకుంది. గత జనవరి నుంచి డీజిల్ ధరలు లీటరుకు 7.69 వరకు పెరిగాయి. ఇంతమేర ధరలు పెంచుతున్నప్పటికీ, ఇంకా చమురు కంపెనీలు సబ్సిడి ధరకే డీజిల్‌ను విక్రయిస్తుండటం వలన సదరు కంపెనీలు భారీగా నష్టపోతున్నట్లు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం లీటరు డీజిల్ విక్రయంపై రూ.10 నష్టం వస్తోందని చమురు కంపెనీ తెలిపాయి.



Click it and Unblock the Notifications








