గ్రేట్ న్యూస్.. 7 ఏళ్ల తర్వాత తగ్గనున్న డీజిల్ ధర!?

By Ravi

మోటారిస్టులకు గుడ్ న్యూస్.. దాదాపు 7 ఏళ్ల తర్వాత డీజిల్ ధరలు తగ్గనున్నాయి. ఇప్పటి వరకూ పెరుగుతూ వచ్చిన డీజిల్ ధరలో త్వరలోనే తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్ల కన్నా తగ్గడంతో, స్వదేశీ మార్కెట్లో డీజిల్ ధరను తగ్గించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 14 నెలల తర్వాత మళ్లీ వంద డాలర్ల కంటే తక్కువ రేటు పలుకుతోంది. ప్రస్తుతం దీని ధర 99.6 డాలర్ల వరకు తగ్గింది. నరేంద్ర మోడీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయటానికి కొద్ది రోజుల మునుపు వరకు దీని ధర దాదాపు 115 డాలర్లుగా ఉండేది. ఫలితంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తప్పనిసరై పెంచాల్సి వచ్చింది.

Diesel Price Cut

పెట్రోల్ ధరకు స్వేచ్ఛ కల్పించడంతో, ప్రతి 15 రోజులకు ఒక్కసారి చొప్పున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సమీక్ష జరిపి, దీని ధరను అంతర్జాతీయ మార్కెట్‌లోని ధరను అనుసరించి పెట్రోల్ ధరను తగ్గించడం/పెంచడం చేసేవారు. అయితే, డీజిల్ ధరను మాత్రమే ప్రభుత్వమే నియంత్రిస్తున్నప్పటికీ, ఈ నియంత్రణను పాక్షికంగా తొలగించుకునేందుకు ప్రతినెలా 50 పైసల చొప్పున పెంచుతూ వచ్చారు.

ఇలా ప్రతినెలా డీజిల్ ధరను పెంచడం వలన, సబ్సిడీ ధరకే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు డీజిల్‌ను విక్రయించడం వల్ల కలిగే నష్టాలు చాలా వరకు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే, డీజిల్ అమ్మకాల మీద నష్టాల తగ్గి, చమురు కంపెనీలకు లాభాలను గడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, చాలా కాలం తర్వాత తొలిసారిగా డీజిల్ ధరలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, September 9, 2014, 17:53 [IST]
English summary
Diesel price may come down for the first time in 7 years as the global crude price dropping below $100 a barrel.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+