సెప్టెంబర్ 1.03 శాతం తగ్గిన డొమెస్టిక్ కార్ సేల్స్

By Ravi

పండుగ సీజన్‌లో అమ్మకాలు భారీగా పుంజుకుంటాయన్న ఆశలు ఆవిరైనట్లే తెలుస్తోంది. గడచిన సెప్టెంబర్ నెలలో దేశీయ కార్ల అమ్మకాలు సానుకూల వృద్ధికి ప్రతికూల వృద్ధిని కనబరచాయి. సెప్టెంబర్ 2013తో పోల్చుకుంటే, సెప్టెంబర్ 2014లో మొత్తం దేశీయ కార్ల అమ్మకాలు 1.03 శాతం క్షీణించి 1,54,882 యూనిట్లుగా నమోదయ్యాయి.

సెప్టెంబర్ 2013లో దేశీయ కార్ల అమ్మకాలు 1,56,494 యూనిట్లుగా నమోదైనట్లు భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) వెల్లడించిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు మాత్రం 19.34 శాతం వృద్ధి చెందినట్లు సియామ్ పేర్కొంది.

Domestic Car Sales

సెప్టెంబర్ 2013లో 8,85,309 యూనిట్లుగా నమోదైన మోటార్‌సైకిల్ అమ్మకాలు సెప్టెంబర్ 2014లో 19.34 శాతం వృద్ధిని కనబరచి 10,56,509 యూనిట్లుగా నమోదయ్యాయి. మొత్తంగా చూసుకుంటే, ద్విచక్ర వాహనాల అమ్మకాలు (స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల అమ్మకాలు కలిపి) 23.81 శాతం వృద్ధి చెంది 15,67,351 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఇదే సమయంలో వాణిజ్య వాహనాల అమ్మకాలు 8.59 శాతం వృద్ధి చెంది 56,140 యూనిట్లుగా నమోదయ్యా. మొత్తంగా అన్ని విభాగాలకు చెందిన వాహనాల అమ్మకాలు 20.44 శాతం వృద్ధి చెంది 15,80,933 యూనిట్ల నుంచి 19,04,007 యూనిట్లకు పెరిగాయి.

More from DriveSpark

Article Published On: Monday, October 13, 2014, 14:57 [IST]
English summary
Domestic passenger car sales declined 1.03 per cent to 1,54,882 units in September from 1,56,494 units in the year-ago month according to data released by the Society of Indian Automobile Manufacturers (SIAM).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+