అక్టోబర్ 2014లో 2.55 శాతం తగ్గిన దేశీయ కార్ల విక్రయాలు
ఈ పండుగ సీజన్ కార్ కంపెనీలకు పెద్దగా కలిసిరాలేదు. సాధారణంగా ప్రతి ఏటా పండుగ సీజన్‌లో కార్ల అమ్మకాలు జోరందుకుంటాయి. కానీ, ఈ ఏడాది పండుగ సీజన్‌లో మాత్రం అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగాయి.
భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) వెల్లడించిన గణాంకాల ప్రకారం, అక్టోబర్ 2013తో పోల్చుకుంటే అక్టోబర్ 2014 నెలలో దేశీయ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 2.55 శాతం తగ్గి 1,63,199 యూనిట్ల నుంచి 1,59,036 యూనిట్లకు పడిపోయాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎప్పుడూ వృద్ధిని కనబరిచే మోటార్‌సైకిల్ల అమ్మకాలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పట్టాయి. ఈ సమయంలో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు మాత్రం 8.73 శాతం క్షీణించి 11,05,269 యూనిట్ల నుంచి 10,08,761 యూనిట్లకు తగ్గాయి.

సియామ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం, అక్టోబర్ 2014 మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు (స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల అమ్మకాలు కలిపి) 3.61 శాతం క్షీణించి చెంది 14,61,712 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఇదే సమయంలో వాణిజ్య వాహనాల అమ్మకాలు 2.97 శాతం క్షీణించి 51,965 యూనిట్లుగా నమోదయ్యా. మొత్తంగా చూసుకుంటే, అన్ని విభాగాలకు చెందిన వాహనాల అమ్మకాలు కూడా 3.84 శాతం క్షీణించి 18,58,594 యూనిట్ల నుంచి 17,87,146 యూనిట్లకు పడిపోయినట్లు సియామ్ గణాంకాలు తెలియజేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








