ఎలక్ట్రిక్ కార్లలో తప్పని సరిగా ఇంజన్ సౌండ్ వినిపించాలి!
ఎలక్ట్రిక్ కార్లలో విశిష్టతల్లో సైలెంట్ ఇంజన్ కూడా ఒకటి. ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే ఇంజన్లు/మోటార్లు చాలా నిశ్శబ్ధంగా పనిచేస్తుంటాయి. కానీ త్వరలోనే ఇవి రెగ్యులర్ పెట్రోల్/డీజిల్ కార్ల మాదిరిగా శబ్ధం చేస్తూ పరుగులు తీయనున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుండటంతో, రోడ్డుపై శబ్ధం లేకుండా సంచరించే వాహనాల సంఖ్య కూడా అధికమవుతోంది. ఈ సైలెంట్ కార్ల వలన యాక్సిడెంట్‌లు జరిగే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో, యూరప్‌లో 2019 నాటికి అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే ఇంజన్లు/మోటార్లు తప్పనిసరిగా శబ్ధం చేసేలా ఓ నిబంధనను తీసుకురానున్నారు.

అమెరికాలో ఇప్పటికే ఈ తరహా నిబంధన అమల్లో ఉంది. అక్కడి రోడ్లకు గంటకు 28 కిలోమీటర్ల కన్నా తక్కువ వేగంతో వెళ్తున్న అన్ని రకాల ఎలక్ట్రిక్ కార్లు తప్పనిసరిగా శబ్ధం చేయాలనే నిబంధన ఉంది. త్వరలోనే ఈ రూల్‌ను యూరప్‌లో కూడా అమలు చేయనున్నారు.
యూరప్‌లో 2019 నాటికి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఇప్పటికే రెనో జియో ఈవి మరియు నిస్సాన్ లీఫ్ వంటి ఎలక్ట్రిక్ కార్లు ఇతర మోటారిస్టులను అలాగే పాదచారులను అప్రమత్తం చేసేందుకు గాను కృత్రిమంగా శబ్ధం చేస్తాయి. ఇతర ఎలక్ట్రిక్ వాహనాలను ఈ ఫీచర్‌ను యాడ్-ఆన్‌గా ఆఫర్ చేస్తున్నాయి. నిస్సాన్ లీఫ్ కారులో అయితే, ఈ శబ్ధం అవసరం లేదనుకున్నప్పుడు డ్రైవర్ దీనిని ఆఫ్ చేసుకునే వెసలుబాటు కూడా ఉంటుంది. కొత్త రూల్ అమల్లోకి వస్తే, ఈ వెసులుబాటును తొలగించే ఆస్కారం ఉంది.
DON'T MISS: FACEBOOK VIDEO OF THE DAY


Click it and Unblock the Notifications








