ఢిల్లీలో సురక్షితమైన ఈ-రిక్షాలు ప్రారంభం
ప్రయాణీకుల భద్రతను, పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం, దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఎలక్ట్రిక్ రిక్షాలను పరిచయం చేసింది. ఢిల్లీలో ఈ-రిక్షాలను విడుదల చేసిన సందర్భంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. మనుషులే మనషులను లాగే ప్రక్రియకు ఈ-రిక్షాలు ముగింపు పలుకుతాయని అన్నారు.
శ్రామిక శక్తితో కూడుకున్న సైకిల్ రిక్షాల కన్నా ఈ-రిక్షాలు ఎన్నో రెట్లు మెరుగైనవని, మ్యాన్యువల్ రిక్షాలను తొక్కి జీవనం సాగించే దళితులు, ముస్లింలు, షెడ్యూల్ తెగలకు చెందిన ప్రజలు వీటి ద్వారా లబ్ధి పొందుతారని ఆయన చెప్పారు.

పబ్లిక్ రోడ్లపై ఎలక్ట్రిక్ రిక్షాలను ఉపయోగించుకునేందుకు గాను సిక్స్టీన్త్ అమెండ్‌మెంట్ రూల్స్, 2014 క్రింది కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ నెల క్రితమే క్లియరెన్స్ ఇచ్చింది. ఈ కొత్త ఈకో-ఫ్రెండ్లీ రిక్షాలను కొన్ని నిర్ధిష్ట భద్రతా ప్రమాణాలకు లోబడి తయారు చేయనున్నారు. కొత్త నిబంధనలకు లోబడి ఈ-రిక్షాలలో నలుగురు ప్రయాణీకులు, 40 కేజీల లగేజ్‌ను క్యారీ చేయవచ్చు.
రూ.340ల నుంచి బైకర్ బైకింగ్ గ్లౌజ్
ఈ-కార్ట్స్ పేరుతో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ లగేజ్ క్యారీయర్స్ సుమారు 310 కేజీల బరువును మోసుకెళ్లవచ్చు. భద్రతా నిబంధనల దృష్ట్యా గతంలో ఢిల్లీ హై కోర్టు నగరంలో ఈ-రిక్షాల వినియోగాన్ని నిషేధించింది. ఈ ఎలక్ట్రిక్ రిక్షాలలో 2000 వాట్స్ మోటార్ ఉంటుంది. వీటి గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ఈ బ్యాటరీ ఆధారిత వాహనాలను నడపాలంటే, డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్‌ని కలిగి ఉండాలనే నిబంధనను విధించారు.


Click it and Unblock the Notifications








