యూరప్‌లోని అన్ని కొత్త కార్లలో ఈఎస్‌పి తప్పనిసరి!

By Ravi

కస్టమర్ల సేఫ్టీని గాలికి వదిలేస్తున్న కార్ కంపెనీలకు చెక్ పెట్టేందుకు మరియు భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు లేని సమాజాన్ని స్థాపించేందుకు పలు దేశాలు ఇప్పటికే తమ దేశంలో అమ్ముడయ్యే అన్ని రకాల వాహనాల్లో నిర్ధిష్ట సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరి చేసిన సంగతి తెలిసినదే. తాజాగా.. యూరప్‌లో అమ్ముడయ్యే అన్ని కార్లలో ఈఎస్‌పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్)ని తప్పనిసరి చేసింది.

ఈఎస్‌పినే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సి) లేదా డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (డిఎస్‌సి) అని కూడా పిలుస్తారు. యూరప్‌లో తయారై, అక్కడి మార్కెట్లో అమ్ముడయ్యే 3.5 టన్నుల కన్నా తక్కువ బరువు కలిగిన అన్ని కొత్త కార్లలో ఇక నుంచి ఈఎస్‌పి తప్పనిసరైంది.

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి) ఫీచర్ ఉన్న కారులో డ్రైవర్ స్టీరింగ్‌పై కంట్రోల్ కోల్పోయినప్పుడు, కారులోని ఆన్-బోర్డ్ కంప్యూటర్ ఆటోమేటిక్‌గా జోక్యం చేసుకొని, ఏ వైపు అయితే కంట్రోల్ తప్పిందో ఆ వైపు చక్రంలోని బ్రేక్స్ ఇండివిడ్యువల్‌గా అప్లయ్ అయ్యి, కారుని తిరిగి డ్రైవర్ కంట్రోల్‌లోకి వచ్చేలా చేస్తుంది. ఇప్పటికే, అమెరికా మరియు కెనడా వంటి మార్కెట్లలో 2011 నుంచి ఈఎస్‌పి ఫీచర్ తప్పనిసరిగా మారింది.

ESP Made Mandatory

సేఫ్టీ అత్యంత ప్రాధాన్యతనిచ్చే యూరప్ మాత్రం ఈ విషయంలో కొంత జాప్యం చేసిందనే చెప్పాలి. ఇకనుంచి (నవంబర్ 1, 2014 నుంచి) యూరప్‌లో అమ్ముడయ్యే 3.5 మెట్రిక్ టన్నుల కన్నా తక్కువ బరువు కలిగిన కొత్త కార్లు మరియు వాహనాల్లో తప్పనిసరిగా ఈఎస్‌పి ఫీచర్ ఉండి తీరాలి. ఈఎస్‌పి సిస్టమ్స్‌లను అందించడంలో జర్మన్ ఆటో కాంపోనెంట్ మేకర్ బోష్ మార్కెట్ లీడర్‌గా ఉంది.

బోష్ ఇప్పటి వరకు సుమారు 100 మిలియన్లకు పైగా ఇలాంటి సిస్టమ్‌‌లను తయారు చేసింది. ఈ కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కార్లలో 1995 నుంచి ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టడం వలన ఇప్పటి వరకు దాదాపుగా 1,90,000 యాక్సిడెంట్లు తప్పాయని, 6,000 మందికి పైగా ప్రాణాలను కాపాడగలిగామని తెలిపింది. ఇప్పటి వరకూ యూరప్‌లో అమ్ముడయ్యే దాదాపు 84 శాతం వహనాల్లో ఈఎస్‌పిని స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు. యాక్సిడెంట్లను తప్పించేందుకు త్వరలో ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా తప్పనిసరి చేయవచ్చని అంచనా.

మనదేశంలో లభిస్తున్న కార్లలో ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్ వంటి బేసిక్ సేఫ్టీ ఫీచర్లే అత్యంత అరుదుగా లభిస్తున్నాయి. మరి ఇలాంటి వాతావరణంలో ఈఎస్‌పి వంటి అధునాత సేఫ్టీ ఫీచర్స్ ఇప్పట్లో మనకు అందుబాటులోకి వస్తాయా? ఏమో 2016లో ఇండియన్ వెహికిల్ రెగ్యులేషన్స్ ఏర్పడిన తర్వాత అందుబాటులోకి రావచ్చేమో!

సరే ఈ లోపుగా ఈఎస్‌పి సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలిపే వీడియోని వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/yOwkwrM10hk?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Tuesday, November 4, 2014, 16:35 [IST]
English summary
Electronic Stability Program (ESP) is made mandatory in all new cars in Europe that weighs under 3.5 tonnes. The ESP feature detects loss of steering control during sudden turns or reflexes and applies enough brakes individually to keep the car in desired path.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+