పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన సర్కార్!

By Ravi

ఈనెలలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనే ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. పెట్రోల్, డీజిల్‌‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం పెట్రోల్, డీజిల్ పై లీటరకు రూ.1.50 సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది.

గతంలో సాధారణ రకం పెట్రోల్‌‌పై లీటరుకు రూ.1.20గా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2.70 మేర పెంచగా, బ్రాండెడ్ పెట్రోల్‌పై ఉన్న సుంకాన్ని లీటరుకు రూ.2.35 నుంచి రూ.3.85 లకు పెంచారు.

అలాగే, డీజిల్‌‌పై కూడా ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం జరింగింది. ఇదివరకు సాధారణ రకం డీజిల్‌‌పై లీటరుకు రూ.1.46గా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2.96కు పెంచగా, బ్రాండెడ్ డీజిల్‌‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.3.75 నుంచి రూ.5.25 లకు పెంచారు.

Diesel

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (క్రూడ్ ఆయిల్) ధర తగ్గుముఖం పడుతోంది. నేపథ్యంలో, నవంబర్ 15వ తేదీన చమురు కంపెనీలు నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో పెట్రోల్, డీజిల్ ధరను తగ్గించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

అయితే, ఎవరూ ఊహించని విధంగా పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో, చమురు కంపెనీ ఈసారి వీటి ధరల తగ్గింపును వాయిదా వేసే ఆస్కారం ఉంది. ఒకవేళ తగ్గించాలని నిర్ణయించుకున్నా, ఆ తగ్గింపు నామమాత్రంగానే ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 14, 2014, 10:29 [IST]
English summary
Government hiked the excise duty on petrol and diesel prices by Rs 1.50 per litre on Thursday. Excise duty on normal or unbranded petrol has been hiked to Rs 2.70 per litre from Rs 1.20 while that of branded petrol has been hiked to Rs 3.85 per litre from Rs 2.35.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+