పిచ్చ పిచ్చగా మోడిఫై చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ500

By Ravi

ఈ ఫొటోలలో మీరు చూస్తున్న ఏ ఫారిన్ కారో లేక మోన్‌స్టర్ మోటార్‌స్పోర్ట్ కారో అనుకుంటే పొరపాటే, ఇందులో కనిపిస్తున్నది మన మేడ్ ఇన్ ఇండియా మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ. ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయిస్తున్న పాపులర్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500ని బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి ఇలా కస్టమైజ్ చేయించుకున్నాడు.

సాధారణంగా మహీంద్రా ఎక్స్‌యూవీ500కి ఎలాంటి కస్టమైజేషన్ అవసరం లేకుండా మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది. కానీ, సదరు వాహన యజమాని మాత్రం, ఈ వాహనాన్ని మరింత అం(మం)దంగా, పక్కా ఆఫ్-రోడ్ ఫీల్‌నిచ్చేలా కస్టమైజ్ చేయించుకున్నాడు.

ఈ ఆఫ్-రోడ్ స్టయిల్ మహీంద్రా ఎక్స్‌యూవీకి సంబంధించి వివరాలు, మరిన్ని ఫొటోలను ఈ కథనంలో చూడండి.

మోడిఫై చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ500

రెగ్యులర్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ ఆధారంగా తయారైన ఈ కస్టమైజ్డ్ ఎక్స్‌యూవీ500ని బ్లాక్ మ్యాట్ ఫినిష్ కలర్‌లో పెయింట్ చేశారు.

మోడిఫై చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ500

ఫ్రంట్ బంపర్ మొదలుకొని రియర్ బంపర్ వరకు ఇందులో అనేక కాస్మోటిక్ మార్పులు చేశారు. ప్రధానంగా, ఫ్రంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్స్, ఎక్స్‌ట్రా ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (ఫ్రంట్ బంపర్‌లో), ఫ్రంట్ బంపర్ క్రింది భాగంలో అమర్చిన అదనపు ల్యాంప్స్, టోయింగ్ ఎక్విప్‌మెంట్ వంటి మార్పులను ఇందులో చూడొచ్చు.

మోడిఫై చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ500

ముందు భాగంలో విండ్‌షీల్డ్ పైన అమర్చిన పొడవాటి ఎల్ఈడి లైట్స్ బార్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రంట్ బానెట్‌పై అమర్చిన రియర్ వ్యూ మిర్రర్ (టొయోటా ఫార్చ్యూనర్ తరహాలో) కూడా కొత్తగా అనిపిస్తుంది.

మోడిఫై చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ500

ఈ మోడిఫైడ్ ఎక్స్‌యూవీ500 వెనుక భాగాన్ని గమనిస్తే, రూఫ్‌పై ఏర్పాటు చేసిన ధృడమైన ర్యాక్, ఆ ర్యాక్‌పైకి చేరుకునేందుకు ఏర్పాటు చేసిన ల్యాడర్ (నిచ్చెన) అధనపు ఇంధన కోసం ఫ్యూయెల్ క్యాన్, టైరును మార్చుకునేందుకు స్టాండర్డ్ జాక్ వంటి మార్పులు చూడొచ్చు.

మోడిఫై చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ500

ఇక చివరగా ట్రాక్టర్ టైర్ల మాదిరిగా ఉండే పెద్ద చక్రాలు. మొత్తమ్మీద చూసుకుంటే ఇందులో కొన్ని మంచి మోడిఫికేషన్లు అలానే చెడు మోడిఫికేషన్లు ఉన్నాయి.

మరి ఈ మోడిఫైడ్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 మీకు కూడా నచ్చిందా..?


Images via Team-BHP

More from DriveSpark

Article Published On: Friday, September 19, 2014, 17:32 [IST]
English summary
Take a look at the extremely modified Mahindra XUV500 SUV. An off-road enthusiast in Bengaluru, Karnataka has modified his Mahindra XUV 500 intensely to equip as many fitment as possible, ticking almost everything a custom mod shop could offer to do.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+