క్రాష్ టెస్ట్ రిజల్ట్స్ స్విఫ్ట్ అమ్మకాలపై ప్రభావం చూపవు: మారుతి
మారుతి సుజుకి బెస్ట్ సెల్లింగ్ మోడల్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (గ్లోబల్ ఎన్‌సిఏపి) నిర్వహించిన క్రాష్ టెస్టులో జీరో రేటింగ్‌ను దక్కించుకొని, ఈ టెస్టులో విఫలమైన సంగతి తెలిసినదే. ఇదే టెస్టులో డాట్సన్ గో కారు కూడా విఫలం కావటం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో, భారత్‌లో డాట్సన్ గో అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించడం కూడా జరిగింది.
అయితే, డాట్సన్ గో మాదిరిగా భారత్‌లో మారుతి స్విఫ్ట్ అమ్మకాలను మాత్రం నిలిపివేసే సందర్భాలు కనిపించడం లేదు. గ్లోబల్ ఎన్‌సిఏపి నిర్వహించిన క్రాష్ టెస్టులో స్విఫ్ట్ కారు విఫలం కావటంపై మారుతి సుజుకి ఇండియా ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.వి.రామన్ మాట్లాడుతూ.. ఈ కారును భారతదేశంలోని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశామని, తాజాగా గ్లోబల్ ఎన్‌సిఏపి విడుదల చేసిన నివేదిక స్విఫ్ట్ కార్ల అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఆయన చెప్పారు.

భారత్‌తోపాటు తాము వ్యాపారం చేస్తున్న వివిధ దేశాల్లో, ఆయా దేశాలకు భద్రతా ప్రమాణాల అవసరాలకు అనుగుణంగా కార్లను తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు. భారతదేశంలో నూతన భద్రత ప్రమాణాలు 2016-17 నాటకి పూర్తిస్థాయిలో అమలు కావచ్చని, ఈ నూతన భద్రతా ప్రమాణాలు అమల్లోకి వస్తే కార్ల ధరలు కనీసం రూ.15,000 మేర పెరిగే అవకాశం ఉంటుంది, చిన్న కారును కొనుగోలు చేయాలనుకునే మధ్య తరగతి కస్టమర్లకు ఇది అదనపు భారం అవుతుందని ఆయన వివరించారు.
ఇదే క్రాష్ టెస్ట్ అంశంపై మరో మారుతి సుజుకి అధికారి మనోహర్ భట్ (వైస్ ప్రెసిడెంట్ -మార్కెటింగ్) మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం మరియు దేశంలోని నియంత్రణ సంస్థలు నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను తమ అన్ని కార్లు పాటిస్తాయని, కానీ ఇప్పుడు విదేశాల్లో అనుసరిస్తున్న అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ కార్లను టెస్ట్ చేస్తే, అవి అందులో పాస్ కాకపోవచ్చని అన్నారు.



Click it and Unblock the Notifications








