ఫెరారీ చైర్మన్ లుకా డి మోంటెజ్‌మోలో రాజీనామా
ఫెరారీ చైర్మన్ లుకా డి మోంటెజ్‌మోలో తన చైర్మన్ పదవికి రాజీనామా చేయనున్నారు. గడచిన 1991వ సంవత్సరం నుంచి ఫెరారీ సంస్థకు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లుకా డి మోంటెజ్‌మోలో వచ్చే నెలలో తన పదవి నుంచి తప్పుకోనున్నారు.
ఫెరారీ కొత్త చైర్మన్‌గా లుకా డి మోంటెజ్‌మోలో స్థానంలో ఫియట్ సిఈఓ సెర్గియో మెర్చియోన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎఫ్‌సిఏ (ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్) గ్రూపులో ఫెరారీ అత్యంత కీలకమైనదని, దాదాపు 23 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తాను చైర్మన్‌గా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాని మోంటెజ్‌మోలో తెలిపారు. అక్టోబర్ 13, 2014న ఆయన చైర్మన్ పదివి నుంచి తొలగిపోనున్నారు.
కాగా.. ఫెరారీ చైర్మన్ పదవి నుంచి లుకా డి మోంటెజ్‌మోలో తప్పుకోవటానికి గల అసలైన కారణం తెలియకపోయినప్పటికీ, ఫెరారీ రోడ్ కార్ డివిజన్ భవిష్యత్తు గురించి అలాగే ఇటీవలి కాలంలో ఫెరారీ ఎఫ్1 టీమ్ పెర్ఫార్మెన్స్ సమస్యల గురించి మోంటెజ్‌మోలో మరియు మార్చియోన్‌ల మధ్య తలెత్తిన వివాదాలే ఇందుకు కారణమనే పుకార్లు వినిపిస్తున్నాయి.



Click it and Unblock the Notifications








