అవెంచురా బుకింగ్స్‌ను ప్రారంభించిన ఫియట్ ఇండియా
గడచిన ఆగస్ట్ నెలలో అప్‌గ్రేడెడ్ పుంటో ఇవో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసిన ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ ఇండియా, రానున్న అక్టోబర్ నెలలో తమ సరికొత్త ఫియట్ అవెంచురా క్రాసోవర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, ఫియట్ అవెంచురా క్రాసోవర్ కోసం కంపెనీ డీలర్లు ఇప్పటి నుండే బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించారు.
ఫియట్ అవెంచురా క్రాసోవర్ 1.2 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఈ ఇంజన్లు విభిన్న ట్యూనింగ్స్‌తో లభ్యం కానున్నాయి. ఫియట్ అవెంచురా క్రాసోవర్‌ను కంపెనీ ఇటీవలే విడుదల చేసిన పుంటో ఇవో ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. బెటర్ ఆఫ్-రోడ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఇందులో అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌ను మరియు బెటర్ రోడ్ గ్రిప్ కోసం 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు.

ఫియట్ అవెంచురాలోని ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్ మరో అదనపు ఆకర్షణ. వీటిపై సైకిల్స్, సర్ఫ్ బోర్డ్స్, ర్యాఫ్ట్స్, క్యాంప్ కిట్స్ మొదలైన వాటిని స్టోర్/ఫిక్స్ చేసుకోవచ్చు. ఇందులో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మాదిరిగా స్పేర్ వీల్‌ను వెనుక (బూట్) డోర్‌కు కాకుండా, వెనుక బంపర్‌కు ఉండే ఓ ప్రత్యేకమైన సిస్టమ్ ద్వారా అమర్చబడి ఉంటుంది. చూడటానికి ఇది బూట్ డోర్‌కు అమరి ఉన్నట్లే అనిపిస్తుంది. ఇందులోని వెనుక సీట్లను 60:40 నిష్పత్తిలో రెండు సార్లు (డబుల్ ఫోల్డ్) మడుచుకొని అదనపు లగేజ్ స్పేస్ పొందవచ్చు.
ఫియట్ అవెంచురా క్రాసోవర్‌లో సెగ్మెంట్లో కెల్లా మొట్టమొదటి సారిగా హై టెర్రైన్ గేజెస్ ఫీచర్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇది కారు వెళ్లే దిశను, కోణాన్ని మొదలైన సమాచారాన్ని తెలియజేస్తుంది. కొత్త ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కొత్త గ్రిల్, ఫ్లాట్ బానెట్, రివైజ్డ్ ఎయిర్‌డ్యామ్స్, మెటల్ స్కిడ్ గార్డ్ వంటి ఫీచర్లతో సరికొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఫియట్ అవెంచురా వెనుక డిజైన్‌ను గమనిస్తే, సరికొత్త డిజైన్‌తో కూడిన టెయిల్ ల్యాంప్స్, రియర్ బంపర్, స్ప్లిట్ సైలెన్సర్ మొదలైన ఫీచర్లు ఇందులో విశిష్టంగా ఆకట్టుకుంటాయి.
ఫియట్ అవెంచురాను బుక్ చేసుకునేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








