ఫియట్ కార్ల వినియోగదారుల కోసం సమ్మర్ చెకప్ క్యాంప్
ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ ఇండియా తమ కార్ల వినియోగదారుల కోసం ఉచిత సమ్మర్ చెకప్ క్యాంపులను ప్రారంభించింది. ఈ వేసవిలో తమ కస్టమర్ల కార్లు కండిషన్‌లో ఉండేలా చూసుకునేందుకు ఈ ఉచిత చెకప్ క్యాంపులను ప్రారంభిస్తున్నామని కంపెనీ పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఉన్న 85 నగరాల్లోని ఫియట్ డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా ఈ ఉచిత సమ్మర్ చెకప్ సర్వీస్ క్యాంప్‌లు నిర్వహించనున్నారు. ఈ క్యాంప్‌లను ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
ఈ ఉచిత సర్వీస్ క్యాంప్‌కు తీసుకు వచ్చే ఫియట్ వాహనాలకు కంపెనీ 54-పాయింట్ చెకప్‌ను ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా, ఉచిత టాప్ వాష్, ఉచిత ఏసి చెకప్, లేబర్ చార్జీలపై 20 శాతం తగ్గింపు, ఏసికి సంబంధించిన విడిభాగాలపై 10 శాతం తగ్గింపును ఆఫర్ చేయనున్నారు.
ఫియట్ ఎక్స్‌క్లూజివ్ డీలర్‌షిప్ ఎగ్జిక్యూటివ్‌లు తమ ఫియట్ కస్టమర్లను ఎస్ఎమ్ఎస్‌లు, ఈ-మెయిల్స్ ద్వారా సంప్రదించి ఈ క్యాంప్‌ల గురించి వివరించనున్నారు.



Click it and Unblock the Notifications








