ఫియట్ ఇండియాకు షాక్; కంపెనీ ఎండి రాజీనామా
ఫియట్ ఇండియాకు భారీ షాక్ తగిలింగి. భారత్‌లో ఫియట్ ఛీఫ్‌గా పనిచేస్తున్న నాగేష్ బసవనహళ్లి తన పదవి నుంచి తప్పుకున్నారు. గడచిన సంవత్సరం ఏప్రిల్ నెలలో ఫియట్ ఇండియా ఛీఫ్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
నాగేష్ బసవనహళ్లి టాటా మోటార్స్‌ను వదిలిపెట్టిన తర్వాత ఫియట్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. ఫియట్‌లో చేరడానికి ముందుగా ఆయన చెన్నైలో ఉన్న ఫియట్ అండ్ క్రైస్లర్ ఏపిఏసి (ఆసియా పసిఫిక్) టెక్నికల్ సెంటర్‌కి ఇంచార్జ్‌గా పనిచేశారు.
ఫియట్ ఇండియా నుంచి నాగేష్ బసనవహళ్లి తప్పుకోవటానికి గల కారణాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే, అతని మూడేళ్ల కాంట్రాక్ట్ పరిమితి ముగియటం వల్లనే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఫియట్ భారత్‌లో అనేక కార్ కంపెనీలకు డీజిల్ ఇంజన్లను సరఫరా చేస్తున్న సంగతి తెలిసినదే. టాటా మోటార్స్ నుంచి ఫియట్ విడిపోయిన తర్వాత స్వతహాగా డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసుకొని, స్వంతంగా కార్ల విక్రయాలు ప్రారంభించింది.
ప్రస్తుతం ఫియట్ ఇండియా దేశీయ విపణిలో పుంటో, లీనియా, అవెంచురా మోడళ్లను విక్రయిస్తోంది. భవిష్యత్తులో జీప్ బ్రాండ్‌తో పలు ఇతర మోడళ్లను ఇక్కడి మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








