ఫియట్ ఇండియా నుంచి ఉచిత నేషనల్ చెకప్ క్యాంప్స్

By Ravi

ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ ఇండియా తమ కస్టమర్ల కోసం ఉచిత చెకప్ క్యాంపులను ప్రారంభించింది. సెప్టెంబర్ 26 నుంచి 28వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న 109 ఫియట్ అధీకృత వర్క్‌షాపులలో ఈ ఉచిత నేషనల్ చెకప్ క్యాంపులను నిర్వహించనున్నారు.

భారత మార్కెట్ పట్ల తమకున్న కట్టుబాటును ప్రదర్శించుకునేందుకు మరియు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ ఉచిత చెకప్ క్యాంపులను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ చెకప్ క్యాంప్స్ గురించి ఫియట్ ఎక్స్‌క్లూజివ్ డీలర్లు తమ కస్టమర్లకు టెక్స్ట్ మెసేజ్‌లు మరియు ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం పంపించనున్నారు.

భారతదేశంలో 91 నగరాల్లోని అన్ని అధీకృత ఫియట్ షోరూమ్‌లలో ఈ ఉచిత చెకప్ క్యాంప్స్ నిర్వహించనున్నారు. అయితే, పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు బీహార్ రాష్ట్రాలలో మాత్రం ఈ క్యాంప్‌లను నవంబర్ 2014లో నిర్వహించనున్నారు.

FIAT India Sets Up Free National Check up Camps

ఫియట్ ఇండియా ఉచిత నేషనల్ చెకప్ క్యాంప్‌కు వచ్చే ఫియట్ వాహనాలకు 52 పాయింట్ చెకప్ చేస్తారు. అంటే కారులో 52 అంశాలను తనిఖీ చేసి, లోపాలు ఏవైనా ఉంటే సరిచేస్తారు. అలాగే, ఉచిత టాప్ వాష్, లేబర్ చార్జీలపై 20 శాతం తగ్గింపు, విడిభాగాలపై 10 శాతం తగ్గింపును కూడా ఆఫర్ చేయనున్నారు.

అంతేకాకుండా.. ఈ క్యాంపుకు వచ్చే కస్టమర్లు కంపెనీ ఇటీవలే విడుదల చేసిన ఫియట్ పుంటో ఇవో కారును టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు. అలాగే, ఎవరైనా ఆసక్తి కలిగిన కస్టమర్లు కొత్తగా కంపెనీ విడుదల చేయనున్న అవెంచురా క్రాసోవర్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, September 25, 2014, 11:27 [IST]
English summary
FIAT Group Automobiles India Pvt. Ltd (FGAIPL) has undertaken a massive after sales initiative across India. FGAIPL will set up free national checkup camps at its exclusive dealerships across India that will start on 26th September and end on 28th September.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+