ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1,00,000 సేల్స్ మైల్‌స్టోన్
ఫోర్డ్ ఇండియా అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈకోస్పోర్ట్, భారత మార్కెట్లో అప్పుడే లక్ష యూనిట్ల మైలురాయిని చేరుకుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ అనే కొత్త సెగ్మెంట్‌ను ప్రారంభిస్తూ అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా గడచిన సంవత్సరం జూన్ నెలలో తమ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ 13 నెలల కాలంలో ఫోర్డ్ ఇప్పటి వరకు 1,00,000 యూనిట్ల ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలు సేల్ అయినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇప్పటి వరకు 60,000 యూనిట్లకు పైగా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలను కంపెనీ డెలివరీ చేయగా మిగిలిన యూనిట్ల డెలివరీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీ వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు గాను ఫోర్డ్ తమ చెన్నై ప్లాంట్‍లో ఈ మోడల్ ఉత్పత్తి పెంపు కోసం మూడవ షిఫ్టును కూడా ప్రారంభించింది. ప్రస్తుతం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కోసంకస్టమర్లు 4-6 నెలల వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా, ఈ మోడల్ కోసం కొత్త బుకింగ్‌లను కూడా ఫోర్డ్ డీలర్లు స్వీకరిస్తున్నారు.

భారత్‌లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మూడు ఇంజన్ వేరియంట్లలో (1.5 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ ఈకోబూస్ట్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్) లభ్యమవుతోంది. ఈ 13 నెలల కాలంలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ధరలు కూడా భారీగానే పెరిగాయి. జూన్ 2013లో విడుదలైనప్పుడు ఈకోస్పోర్ట్ ప్రారంభ ధర రూ.5.59 లక్షలుగా ఉండేది, ఇప్పుడది రూ.6.30 లక్షలకు పెరిగింది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వేరియంట్ల వారీ తాజా ధరలు (ఆగస్ట్ 2014 నాటికి) క్రింది విధంగా ఉన్నాయి:
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ ధరలు (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్):
1. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ఆంబీంటే - రూ.6.30 లక్షలు
2. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ట్రెండ్ - రూ.7.25 లక్షలు
3. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి టైటానియం - రూ.8.21 లక్షలు
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ ధరలు (ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్):
4. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఏటి టైటానియం - రూ.8.45 లక్షలు
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 లీటర్ పెట్రోల్ వెర్షన్ ధరలు (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్):
5. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 ఎమ్‌టి టైటానియం - రూ.8.61 లక్షలు
6. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 ఎమ్‌టి టైటానియం (ఆప్షనల్) - రూ.9.14 లక్షలు
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 లీటర్ డీజిల్ వెర్షన్ ధరలు (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్):
7. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ఆంబీంటే - రూ.7.35 లక్షలు
8. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ట్రెండ్ - రూ.8.15 లక్షలు
9. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి టైటానియం - రూ.9.15 లక్షలు
10. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి టైటానియం (ఆప్షనల్) - రూ.9.69 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. ఆగస్ట్ 2014 నాటికి)


Click it and Unblock the Notifications








