ఫోర్డ్ కొత్త సీఈఓ జీతం సంవత్సరానికి రూ.10.50 కోట్లు!
అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్స్ 'మార్క్ ఫీల్డ్స్'ను తమ కొత్త సీఈఓ (ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. మార్క్ ఫీల్డ్స్ ఇదివరకు ఫోర్డ్ మోటార్స్‌లో సీఓఓ (ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్)గా పనిచేసేవారు. సీఓఓగా పని చేస్తున్నప్పుడు మార్క్ ఫీల్డ్స్ జీతం సంవత్సరానికి 1.6 మిలియన్ డాలర్లు.
కాగా.. అతను సీఓఓ నుంచి సీఈఓగా పదోన్నతి పొందటంతో అతని జీతం కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం మార్క్ ఫీల్డ్స్ జీతం సంవత్సరానికి 1.75 మిలియన్ డాలర్లు (అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ.10.50 కోట్లు). ఫోర్డ్ అంచాలను మార్క్ ఫీల్డ్స్ అందుకోగలిగినట్లయితే, కంపెనీ అతనికి అదనంగా మరో 9 శాతం జీతం పెంచనుంది.

ఇదే కాకుండా.. మార్క్ ఫీల్డ్స్ కోసం ఫోర్డ్ మోటార్స్ స్టాక్ ఆప్షన్‌ను కూడా హోల్డ్‌లో ఉంచింది, అతని పెర్ఫార్మెన్స్‌ను ఆధారంగా చేసుకొని ఈ స్టాక్స్ అతనికి అప్పగించనున్నారు. ఇదివరకు ఫోర్డ్ మోటార్స్‌కు సీఈఓగా ఉన్న అలన్ ములల్లీ రాజీనామా చేయటంతో ఫోర్డ్ యాజమాన్యం ఆ బాధ్యతలను మార్క్ ఫీల్డ్స్‌కు అప్పగించింది.
మార్క్ ఫీల్డ్స్ ఇప్పుడు ప్రపంచంలో కెల్లా అత్యధికంగా జీతం తీసుకుంటున్న సీఈఓలలో ఒకరుగా నిలిచారు. కేవలం ఉద్యోగుల వ్యక్తిగత ప్రతిభను ఆధారంగా చేసుకొని మాత్రమే జీతాలలో పెంపు ఉంటుందని ఫోర్డ్ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications








