డిఫెన్స్, సెంట్రల్ పోలీస్ క్యాంటీన్‌ల ద్వారా ఫోర్డ్ ఈకోస్పోర్ట్
అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇకపై కేవలం అధీకత ఫోర్డ్ ఇండియా డీలర్‌షిప్‌లలో మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ (సిఎస్‌డి) మరియు సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ (సిపిసి)ల ద్వారా కూడా లభ్యం కానుంది.
దేశానికి సేవలందిస్తున్న మిలటరీ వ్యక్తులు, వారి కుటుంబాలకు చెందిన వారు మరియు ఎక్స్ సర్వీస్‌మెన్‌ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఫోర్డ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ స్టోర్‌ల ద్వారా ఫోర్డ్ క్లాసిక్, ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ ఎండీవర్ వంటి వాహనాలను అందుబాటులో ఉన్నాయి.

ఈ స్టోర్‌ల ద్వారా ఫోర్డ్ వాహనాలను కొనుగోలు చేసే వ్యక్తులకు కంపెనీ ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్స్ ఆఫర్ చేయనుంది. ఇందులో ప్రధానంగా.. సిఎస్‌డి, సిపిసి స్టోర్‌లలో ఆఫర్ చేసే ఇతర బెనిఫిట్లకు అదనంగా, వేరియంట్ అందుబాటును బట్టి ప్రయారిటీ డెలివరీ కూడా ఆఫర్ చేయనున్నారు.
దాదాపు 30 ప్రతిష్టాత్మక పరిశ్రమ అవార్డులను గెలుచుకున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్, ఇప్పటికే ఒక లక్ష అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ఈ మోడల్‌కి ఇప్పటికీ భారీ డిమాండ్ ఉంది. కొన్ని వేరియంట్లకు వెయింటింగ్ పీరియడ్ మూడు నెలల వరకూ ఉంటోంది.


Click it and Unblock the Notifications








