ఫోర్డ్ ఫిగో ఇప్పుడు ఇన్-బిల్ట్ వై-ఫైతో లభ్యం!
అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా అందిస్తున్న చిన్న కారు 'ఫోర్డ్ ఫిగో' ఇప్పుడు ఓ సరికొత్త ఫీచర్‌తో లభ్యం కానుంది. ఎల్లప్పుడు ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉండాలనుకునే కస్టమర్ల కోసం కంపెనీ ఇందులో ఇన్-బిల్ట్ వై-ఫై మోడెంను ఆఫర్ చేస్తోంది.
ఫస్ట్ ఇన్ క్లాస్ ఆప్షన్‌గా.. అన్ని ఫోర్డ్ ఫిగో వేరియంట్లలో (ఈఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, టైటానియం) ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఆడియో సిస్టమ్‌ను కంపెనీ ఆఫర్ చేస్తుంది. కారులో వై-ఫై హాట్‌స్పాట్‌ను సృష్టించే ఈ ఆడియో సిస్టమ్‌లోనే కంపెనీ ఓ పరికరాన్ని జోడించింది.
ఇందుకోసం అదనంగా (లేద తమ వద్ద ఉండే) 2జి లేదా 3జి సిమ్ కార్డ్ అవసరం అవుతుంది. ఈ సిమ్ కార్డును ఆ పరికరంలో అమర్చుకుంటే, కారులో వై-ఫై లభిస్తుంది. ఈ సిస్టమ్ కోసం కంపెనీ అదనంగా రూ.10,000 వసూలు చేస్తుంది.

అంతేకాకుండా, ఫోర్డ్ తమ కొత్త ఫిగోలో కొన్ని ఎక్విప్‌మెంట్ అప్‌డేట్లను కూడా చేసింది. ఈఎక్స్ఐ వేరియంట్‌లో ఇప్పుడు స్టీరియోను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తుంటే, జెడ్ఎక్స్ఐ వేరియంట్లో డ్రైవర్ ఎయిర్‌బ్యాక్ మరియు ఎలక్ట్రిక్ మిర్రర్లను ఆఫర్ చేస్తున్నారు.
ఈ ఫీచర్ అప్‌డేట్స్ కారణంగా అన్ని వేరియంట్ల (ఎల్ఎక్స్ఐ వేరియంట్ మాత్రం దాదాపు ఇదివరకటి ధరకే లభిస్తుంది) ధరలు పెరిగాయి. ఈఎక్స్ఐ వేరియంట్ ధర రూ.10,000 మేర పెరగగా, జెడ్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ.20,000 మరియు టైటానియం వేరియంట్ ధర రూ.10,000 మేర పెరిగాయి. ఈ అప్‌డేటెడ్ ఫిగో అన్ని ఫోర్డ్ ఇండియా అధీకృత డీలర్‌షిప్ కేంద్రాల్లో లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








