స్పేర్స్ రీటైల్ డిస్ట్రిబ్యూషన్‌ని ప్రారంభించిన ఫోర్డ్ ఇండియా
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న కార్లను కొనుగోలు చేయాలంటే, కస్టమర్లు ఆయా కార్ల స్పేర్ పార్ట్‌ల లభ్యత గురించి ఒకటి రెండు సార్లు ఆలోచించేవారు. ఎందుకంటే, ఫోర్డ్ కార్ల విడిభాగాలు ఎక్కడ పడితే అక్కడ లభ్యం కావు. అధీకృత ఫోర్డ్ డీలర్లు, సర్వీస్ సెంటర్ల వద్దే ఇవి లభ్యమయ్యేవి.
అయితే, ఇప్పుడు ఈ పరిస్థితి త్వరలోనే మారిపోనుంది. ఎందుకంటే, ఫోర్డ్ ఇండియా తమ వాహనాలకు సంబంధించిన విడిభాగాలు ఇకపై రీటైల్‌గా విక్రయించనుంది. ఈ మేరకు ఫోర్డ్ ఇండియా తమ తొలి ఎక్స్‌క్లూజివ్ స్పేర్ పార్ట్స్ షాపును ఢిల్లీలో ప్రారంభించింది. అంతేకాకుండా జెన్యూన్ ఫోర్డ్ స్పేర్ పార్ట్స్‌ను కంపెనీ ఓపెన్ మార్కెట్లో కూడా విక్రయించనుంది.

అంటే, నగరంలో ఉన్న ఏ వర్క్‌షాప్ వద్దైనా లేదా మెకానిక్ వద్దైనా ఫోర్డ్ స్పేర్స్ లభ్యం కానున్నాయి. ఫోర్డ్ వాహనాలు ఉపయోగించే కస్టమర్లు తమకు సౌకర్యమైన ప్రదేశంలో సర్వీస్ చేయించుకునేందుకు వీలుగా కంపెనీ ఈ చర్య తీసుకుంది. ఫోర్డ్ జెన్యూన్ స్పేర్స్ ఓపెన్ మార్కెట్లోనే కాకుండా అధీకృత డీలర్ల వద్ద కూడా లభ్యం అవుతాయి.
ఫోర్డ్ స్పేర్స్‌ను ఓపెన్ మార్కెట్లో విక్రయించడం కారణంగా, డీలర్‌షిప్స్ వద్ద వెయిటింగ్ తగ్గడమే కాకుండా, స్పేర్ పార్ట్స్ ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, ఇవి ఫోర్డ్ జెన్యూన్ స్పేర్స్ కాబట్టి నాణ్యత విషయంలో కూడా ఎలాంటి సమస్య ఉండబోదు. ఢిల్లీలో ఎమినెంట్ ఆటో పార్ట్స్‌ను ఫోర్డ్ ఇండియా తమ డిస్ట్రిబ్యూటర్‌గా నియమించుకుంది. రానున్న రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళతో మరిన్ని ఇతర రాష్ట్రాలలో ఈ సౌకర్యాన్ని ఫోర్డ్ ఇండియా ప్రారంభించనుంది.


Click it and Unblock the Notifications








