నిశ్శబ్ధ పోరాటం చేస్తున్న ఫోర్డ్ ఇండియా చెన్నై ప్లాంట్ వర్కర్లు!
టొయోటా కిర్లోస్కర్ మోటార్ బిడది ప్లాంటులో కార్మికుల సమస్య పూర్తిగా సద్దుమణగక మునుపే, ఫోర్డ్ ఇండియా చెన్నై ప్లాంటులో ఓ కొత్త కార్మిక సమస్య ఎదురైంది. చెన్నై సరిహద్దుల్లోని మరైమలై నగర్ వద్ద ఉన్న ఫోర్డ్ ఇండియా ప్లాంటులో కార్మికులు కూడా సమ్మె చేస్తున్నారు.
అయితే, వీరు మాత్రం చాలా శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఉత్పత్తికి అంతరాయం కలగకుండా వీరి సమ్మె సాగుతోంది. కంపెనీ క్యాంటీన్‌లలోని భోజనాన్ని నిరాకరిస్తూ, కార్మికుల కోసం కంపెనీ అందిస్తున్న రవాణా సదుపాయాలను కూడా నిరాకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: టొయోటా బిడది ప్లాంట్స్ లాకౌట్
వీరి సైలెంట్ ప్రొటెస్టుకు ప్రధాన కారణం పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్‌ను తగ్గించడమే. మునుపటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెర్ఫార్మెన్స్ ఇంటెన్సివ్‌ను కంపెనీ 10 శాతానికి పైగా తగ్గించడంతో దాదాపు 1800 వర్కర్లు అసంతృప్తితో ఉన్నారు.

ఫోర్డ్ చెన్నై ప్లాంటులో 2012లో 1.03 లక్షలుగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యం 2013 నాటికి 1.22 లక్షలకు చేరుకుంది (ప్రధానంగా ఈకోస్పోర్ట్ వలన). దీనికి తోడు ఇదే సమయంలో పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ 26 శాతం నుంచి 15.8 శాతానికి పడిపోయింది. కనీసం ఇదివరకు ఆఫర్ చేసిన ఇన్సెంటివ్ స్థాయికైనా దీనిని పెంచాలని వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఫోర్డ్ ఇండియా ద్వారా అధికారికంగా గుర్తించిన వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఈ ప్లాంటులో లేదు. దానికి బదులుగా వర్కర్స్ కమిటీ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవటం జరుగుతుంటుంది. ఫోర్డ్ ఇండియా మరైమలై నగర్ ప్లాంటును 1995లో స్థాపించారు. ప్రస్తుతం ఈ ప్లాంటులో 6000 మంది వర్కర్లు ఉన్నారు. ఈ ప్లాంటులో ఫిగో, ఫియస్టా, ఈకోస్పోర్ట్ మోడళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన వాటిని 40 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








