13 నెలల్లో 63,000 ఫోర్డ్ ఈకోస్పోర్ట్ డెలివరీలు
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో కొత్త ట్రెండ్‌కు స్వీకారం చుడుతూ అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా గడచిన సంవత్సరం జూన్ నెలలో తమ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. ఈ 13 నెలల కాలంలో ఫోర్డ్ ఇప్పటి వరకు మొత్తం 63,000 యూనిట్ల ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలను డెలివరీ చేసింది.
గతంలో ఈ మోడల్‌కు అనూహ్య స్పందన లభించడంతో ఫోర్డ్ డీలర్లు ఈకోస్పోర్ట్ బుకింగ్‌లను నిలిపి వేసిన సంగతి తెలిసినదే. కాగా తాజాగా.. ఈ మోడల్ కోసం తిరిగి బుకింగ్‌లను ప్రారంభించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ 13 నెలల కాలంలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ధరలు కూడా భారీగానే పెరిగాయి. జూన్ 2013లో విడుదలైనప్పుడు ఈకోస్పోర్ట్ ప్రారంభ ధర రూ.5.59 లక్షలుగా ఉండేది, ఇప్పుడది రూ.6.30 లక్షలకు పెరిగింది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వేరియంట్ల వారీ తాజా ధరలు (ఆగస్ట్ 2014 నాటికి) క్రింది విధంగా ఉన్నాయి:
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ ధరలు (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్):
1. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ఆంబీంటే - రూ.6.30 లక్షలు
2. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ట్రెండ్ - రూ.7.25 లక్షలు
3. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి టైటానియం - రూ.8.21 లక్షలు
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ ధరలు (ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్):
4. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఏటి టైటానియం - రూ.8.45 లక్షలు
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 లీటర్ పెట్రోల్ వెర్షన్ ధరలు (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్):
5. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 ఎమ్‌టి టైటానియం - రూ.8.61 లక్షలు
6. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 ఎమ్‌టి టైటానియం (ఆప్షనల్) - రూ.9.14 లక్షలు
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 లీటర్ డీజిల్ వెర్షన్ ధరలు (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్):
7. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ఆంబీంటే - రూ.7.35 లక్షలు
8. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి ట్రెండ్ - రూ.8.15 లక్షలు
9. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి టైటానియం - రూ.9.15 లక్షలు
10. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఎమ్‌టి టైటానియం (ఆప్షనల్) - రూ.9.69 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. ఆగస్ట్ 2014 నాటికి)


Click it and Unblock the Notifications








