డిసెంబర్‌లో 2.84 శాతం పెరిగిన ఫోర్డ్ ఇండియా అమ్మకాలు
అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి లాంగ్ వెయింటింగ్ పీరియడ్ ఉన్నప్పటికీ, ఎంత ఆలస్యమైనా ఇదే మోడల్‌ను సొంతం చేసుకోవాలని పట్టుబట్టే కస్టమర్ల కారణంగా ఈ మోడల్ అమ్మకాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన డిసెంబర్ 2013 నెలలో ఫోర్డ్ ఇండియా మొత్తం అమ్మకాలు 2.84 శాతం వృద్ధి చెంది 11,209 యూనిట్లుగా నమోదయ్యాయి.
అంతకు ముందు సంవత్సరం డిసెంబర్ నెలలో ఫోర్డ్ ఇండియా మొత్తం అమ్మకాలు 10,899 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సమయంలో దేశీయ అమ్మకాలు 9.9 శాతం క్షీణించి 6,517 యూనిట్ల నుంచి 5,871 యూనిట్లకు పడిపోయాయి. అలాగే, ఎగుమతులు కూడా 21.8 శాతం వృద్ధి చెంది 4,382 యూనిట్ల నుంచి 5,338 యూనిట్లకు పెరిగాయి.
ప్రతికూల ఆర్థిక, వాణిజ్య వాతావరణంలోను ప్రోత్సాహకర వృద్ధిని సాధించామని, 2013 సంవత్సరం ఫోర్డ్ ఇండియాకు మర్చిపోలేని సంవత్సరంగా ఉంటుందని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) వినయ్ పిపర్సానియా వెల్లడించారు.



Click it and Unblock the Notifications








