ఈకోబూస్ట్ ఇంజన్‌తో ఫోర్డ్ ఫియస్టా హ్యాచ్‌బ్యాక్!
అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ భారత మార్కెట్లో ఫియస్టా పేరిట సెడాన్ రూపంలో విక్రయిస్తున్న కారును గ్లోబల్ మార్కెట్లలో అదే పేరుతో హ్యాచ్‌బ్యాక్ రూపంలో విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. కాగా.. గ్లోబల్ ఫోర్డ్ ఫియస్టా హ్యాచ్‌బ్యాక్ ఇప్పటి వరకు 1.5 లీటర్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యమయ్యేది. ఈ నేపథ్యంలో, కంపెనీ తాజాగా ఈ మోడల్‌లో అనేక అవార్డులు గెలుచుకున్నా ఈకోబూస్ట్ ఇంజన్‌ను ప్రవేశపెట్టింది.
ఫోర్డ్ మలేషియా మార్కెట్లో 1.0 లీటర్ (998సీసీ), 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో కొత్త 2014 ఫియస్టా హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ఈ ఇంజన్ గరిష్టంగా 125 పిఎస్‌ల శక్తిని, 170 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ గేర్‌బాక్స్ (ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్)తో మాత్రమే లభిస్తుంది. ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో లేదు.

ప్రస్తుతం మన దేశంలో లభిస్తున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కంపెనీ ఇదే 1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను ఆఫర్ చేస్తున్న విషయం తెలిసినదే. ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను క్రైఓవాలోని రోమానియన్ ప్లాంట్‌లో ఉథ్పత్తి చేస్తున్నారు. ఈ ఇంజన్ వరుసగా రెండేళ్లు ఇంటర్నేషనల్ ఇంజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకుంది.
ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్ సాంప్రదాయ పెట్రోల్ ఇంజన్ల కన్నా విశిష్టంగా ఉండి, మెరుగైన పనితీరును కనబరుస్తుంది. కాగా.. భారత మార్కెట్లో లభిస్తున్న ఫోర్డ్ ఫియస్టా సెడాన్‌లో కూడా ఈ కొత్త 1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను ప్రవేసపెట్టినట్లయితే, ఈ మోడల్ అమ్మకాలు మరింత పుంజుకునే ఆస్కారం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మీరేమంటారు..?


Click it and Unblock the Notifications








