నవంబర్ 2014లో నెక్స్ట్ జనరేషన్ ఫోర్డ్ ఎండీవర్ విడుదల

By Ravi

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్స్ అందిస్తున్న పవర్‌ఫుల్ అండ్ పాపులర్ ఎస్‌యూవీ 'ఎండీవర్'లో కంపెనీ ఓ సరికొత్త తరం మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. ఫోర్డ్‌కి చెందిన ఆస్ట్రేలియా విభాగం, ఫోర్డ్ ఆస్ట్రేలియా గడచిన సంవత్సరం ఆగస్ట్ నెలలో ఆవిష్కరించిన 'ఫోర్డ్ ఎవరెస్ట్' (ప్రస్తుత ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీకి రీప్లేస్డ్ వెర్షన్) ఎస్‌యూవీ కాన్సెప్ట్ నుంచి స్ఫూర్తి పొంది అప్‌గ్రేడ్ చేసిన నెక్స్ట్ జనరేషన్ ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీని ఈనెలలోనే ఆవిష్కరించనున్నారు.

వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి ఈ సరికొత్త 2015 ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల కానుంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మాదిరిగా పెద్ద ట్రాపేజోయ్‌డల్ గ్రిల్, క్రోమ్ సైడ్ మిర్రర్స్, పెద్ద వీల్ ఆర్చెస్ వంటి ఎక్స్టీరియర్ మార్పులతో పాటుగా ఇంటీరియర్లలో కూడా అనేక అప్‌గ్రేడ్స్ ఈ కొత్త ఎండీవర్ ఎస్‌యూవీలో ఉండనున్నాయి.


సెవన్ సీటర్ లేఅవుట్ కోసం అదే బాడీ-ఆన్-ఫ్రేమ్‌ను ఉపయోగించాలని ఫోర్డ్ భావిస్తోంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లో చూసినట్లుగా 4-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫోర్డ్ సింక్ సిస్టమ్‌లను కూడా కొత్త 2015 ఫోర్డ ఎండీవర్‌లో పరిచయం చేసే అవకాశం ఉంది.

నెక్స్ట్ జనరేషన్ ఫోర్డ్ ఎండీవర్‌‌లో 2.2 లీటర్ మరియు 3.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు. అలాగే ఇందులో 2.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను కూడా ఫోర్డ్ పరిచయం చేసే ఆస్కారం ఉంది (అయితే, ఈకోబూస్ట్ ఇంజన్ ఇప్పట్లో ఇండియన్ మార్కెట్లో విడుదల కాకపోవచ్చు). ఇది టూ-వీల్ డ్రైవ్ (4x2), ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్లతో, మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

Ford Endeavour

ఫోర్డ్ ఇండియా ఈ ఏడాది ఏప్రిల్ (2014) నెలలో రిఫ్రెష్డ్ ఎండీవర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం దేశీయ విపణిలో లభిస్తున్న ఫోర్డ్ ఎండీవర్ మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. బేస్ వేరియంట్లో 2.5 లీటర్ టిడిసిఐ డ్యురాటార్క్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది టూవీల్ డ్రైవ్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో లభిస్తుంది.

రెండవ ఇంజన్ ఆప్షన్ (మిడ్-వేరియంట్) విషయానికి వస్తే.. ఇందులో 3.0 లీటర్ డిటిసిఐ డ్యురాటార్క్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది టూవీల్ డ్రైవ్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో లభ్యం కానుంది. ఇకపోతే మూడవ ఆప్షన్ (టాప్-ఎండ్ వేరియంట్)లో కూడా ఇదే 3.0 లీటర్ ఇంజన్ ఉపయోగించారు. కాకపోతే ఇది ఫోర్-వీల్ డ్రైవ్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది.


కాగా.. కొత్తగా రానున్న 2015 ఫోర్డ్ ఎండీవర్ భారత మార్కెట్లోని టొయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఫోర్డ్ ఎవరెస్ట్ కాన్సెప్ట్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, November 5, 2014, 12:33 [IST]
English summary
US auto major Ford is all set to on unveil its production version next generation Endeavour in November 2014. This 2015 Ford Endeavour will be launched in India sometime next year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+