డీజిల్ కార్లను తొలగించనున్న ఫ్రాన్స్!
యూరోపియన్ దేశమైన ఫ్రాన్స్, తమ దేశపు రోడ్లపై నుంచి డీజిల్‌తో నడిచే వాహనాలను మెల్లిమెల్లిగా తొలగించాలని యోచిస్తోంది. అత్యధిక కాలుష్యాన్ని కలుగజేసే డీజిల్ వాహనాలను గుర్తించేందుకు ఫ్రాన్స్ ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది.
వచ్చే ఏడాదిలో ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ వ్యవస్థ అత్యధిక కాలుష్యాన్ని కలుగజేసే డీజిల్ వాహనాలను గుర్తించి, వాటికి ర్యాంకింగ్ ఇవ్వటం మరియు వాటిని సిటీలో నడపటానికి కొన్ని పరిమితులను విధించడం కూడా చేయనున్నారు.
ఫ్రాన్స్ దేశంలో దాదాపు 80 శాతం మోటారిస్టులు డీజిల్‌తో నడిచే వాహనాలను ఉపయోగిస్తున్నారు, ఫలితా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండటంతో, ఆ దేశపు సర్కారు ఈ నిర్ణయానికి వచ్చింది. రోడ్లపై డీజిల్ వాహనాల సంఖ్యను తగ్గించాలని ఫ్రాన్స్ భావిస్తోంది.

ఫ్రాన్స్ ప్రధానమంత్రి మాన్యుయేల్ వల్లాస్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఫ్రాన్స్‌లోని మోటారిస్టులు డీజిల్ వాహనాలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని, ఇకపై ఈ ఇష్టాన్ని తగ్గించుకోవాలని అన్నారు.
డీజిల్ వాహనాలను నియంత్రించేందుకు గాను ప్రతి లీటరుపై 2 యూరో సెంట్ల అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలు తమ డీజిల్ వాహనాలను స్క్రాప్‌గా మార్చి, ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలనుకుంటే, వారికి 10,000 యూరోల బోనస్ కూడా అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.


Click it and Unblock the Notifications








