త్వరలో దిగిరానున్న ఇంధన ధరలు..

By Ravi

ఇంధన ధరలు భారీగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు తగ్గుతున్న నేపథ్యంలో, దేశీయ విపణిలో కూడా చమురు కంపెనీలు ఇంధన ధరలను తగ్గించే అవకాశాలున్నాయి. గడచిన శుక్రవారం నాడు బ్యారెల్ ముడిచమురు ధర 90 డాలర్ల కన్నా దిగువన ఉంది. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే, త్వరలోనే ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది.

ఇప్పటి వరకూ ఊహించసాధ్యం కాని విధంగా డిస్కౌంట్ యుద్ధంలో సౌదీ అరేబియాతో పోటీగా ఇరాన్ చేరడంతో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కాగా.. ఈ సానుకూల పరిస్థితిని ఆసరగా చేసుకొని డీజిల్ ధరలపై వీలైనంత త్వరగా నియంత్రణలను ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

గడచిన జూన్‌తో పోల్చుకుంటే చమురు ధరలు దాదాపు 20 శాతం తగ్గాయి. శుక్రవారం నాడు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 88.44 డాలర్లుగా నమోదైంది. చమురు విక్రయం విషయంలో సౌదీ అరేబియా, ఇరాన్‌లు పోటాపోటీగా డిస్కౌంట్లను ప్రకటిస్తుండటంతో, అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు దిగొస్తున్నాయి.

Fuel Prices May Come Down Soon

More from DriveSpark

Article Published On: Saturday, October 11, 2014, 14:17 [IST]
English summary
Hefty cut in fuel prices are round the corner as global benchmark oil prices continue to fall, dropping below $90 a barrel on Friday as Iran joined Saudi Arabia in a discount war - something unthinkable till now.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+