జనవరి 1వ తేదీ నుంచి పెరగనున్న షెవర్లే కార్ల ధరలు

By Ravi

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా, వచ్చే ఏడాది ప్రారంభం నుంచి దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించింది. పెరుగుతున్న ఖర్చుల వత్తిడిని తట్టుకునేందుకు జనవరి 1, 2015వ తేదీ నుంచి వాహనాల ధరలను పెంచుతామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

అంటే, కొత్త సంవత్సరంలో జనరల్ మోటార్స్ కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుదన్నమాట. జనవరి 1వ తేదీ నుంచి అన్ని మోడళ్ల ధరలను 1 శాతం మేర పెంచనున్నామని, మోడళ్లు మరియు వేరియంట్లను బట్టి ఈ పెంపు రూ.5,000 నుంచి రూ.20,000 వరకూ ఉంటుందని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి బాలేంద్రన్ తెలిపారు.

General Motors India Hike Prices From Jan 1

ప్రస్తుతం జనరల్ మోటార్స్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న మోడళ్ల ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
  • షెవర్లే స్పార్క్‌- రూ.3.45 లక్షల నుంచి రూ.4 లక్షలు
  • షెవర్లే బీట్ - రూ.4.01 లక్షల నుంచి రూ.5.93 లక్షలు
  • షెవర్లే సెయిల్ యూ-వీఏ - రూ.4.1 లక్షల నుంచి రూ.6.81 లక్షలు
  • షెవర్లే సెయిల్ - రూ.5.19 లక్షల నుంచి రూ.7.64 లక్షలు
  • షెవర్లే ఎంజాయ్ - రూ.5.8 లక్షల నుంచి రూ.8.22 లక్షలు
  • షెవర్లే తవేరా - రూ.6.9 లక్షల నుంచి రూ.10.68 లక్షలు
  • షెవర్లే క్రూజ్ - రూ.13.79 లక్షల నుంచి రూ.16.30 లక్షలు
  • షెవర్లే కాప్టివా - రూ.23.75 లక్షల నుంచి రూ.25.85 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Tuesday, December 9, 2014, 9:32 [IST]
English summary
General Motors will raise car prices to the tune of 1 per cent from January 1 to offset its input cost pressure, the company said in a release.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+