షెవర్లే క్రూజ్ సెడాన్ రీకాల్; కారణమేమిటి?

By Ravi

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ దేశీయ విపణిలో అందస్తున్న పవర్‌ఫుల్ సెడాన్ 'షెవర్లే క్రూజ్' (Chevrolet Cruze)లో చిన్న సమస్య కారణంగా, కంపెనీ సైలెంట్‌గా వీటిని రీకాల్ చేస్తోంది. ఇంజన్ ఏరియాలో వైర్లను కలిపి ఉంచే పివిసి బ్రాకెట్ సమస్య కారణంగా ఈ మోడల్‌ను రీకాల్ చేస్తున్నారు.

అయితే, మొత్తం ఎన్ని యూనిట్లలో ఈ సమస్య ఉందనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. జనరల్ మోటార్స్ ఇండియా సగటున ప్రతినెలా 130 యూనిట్ల షెవర్లే క్రూజ్ కార్లను విక్రయిస్తోంది. ఈ సమస్యకు సంబంధించి షెవర్లే డీలర్లు తమ కస్టమర్లను సంప్రదిస్తున్నారు. ఈ సమస్యను సరిచేయటానికి సుమారు రెండు గంటల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.

General Motors Recall Cruze Sedan In India

షెవర్లే క్రూజ్ సెడాన్‌లో 2.0 లీటర్, 4-సిలిండర్, విసిడిఐ 16వి ఎస్ఓహెచ్‌సి డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3800 ఆర్‌పిఎమ్ వద్ద 165 బిహెచ్‌పిల శక్తిని మరియు 2000 ఆర్‌పిఎమ్ వద్ద 380 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తుంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో జనరల్ మోటార్స్ విక్రయిస్తున్న షెవర్లే క్రూజ్ సెడాన్ ధరలు రూ.13.80 లక్షల నుంచి రూ.16.30 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

More from DriveSpark

Article Published On: Saturday, December 6, 2014, 17:34 [IST]
English summary
General Motors had recently introduced a facelift to their Cruze sedan in India. The manufacturer now has issued a silent recall of their sedan. They claim there is an issue with a PVC bracket that keeps the wire in place within the engine area.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+