రూ.49,000 వరకు కార్ల ధరలు తగ్గించిన జనరల్ మోటార్స్
ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంత బడ్జెట్‌లో కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జనరల్ మోటార్స్ ఇండియా దేశీయ విపణిలో తమ కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మోడల్‌ను బట్టి రూ.12,000 నుంచి రూ.49,000 వరకూ ఉంటుందని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ తెలిపారు. సుంకం తగ్గింపు ప్రయోజనాలు పూర్తిగా వినియోగదారులకే అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో ఇప్పటికే అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను తగ్గించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, జనరల్ మోటార్స్ ఇటీవలే ముగిసిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన సరికొత్త అప్‌గ్రేడెడ్ షెవర్లే బీట్‌ను కంపెనీ వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ షెవర్లే బీట్ ధరలు రూ.3.98 లక్షల నుంచి రూ.6.21 లక్షల (ఎక్స్ షోరూమ్, చెన్నై) రేంజ్‌లో ఉన్నాయి.

జనరల్ మోటార్స్ ప్రస్తుతం భారత మార్కెట్లో స్పార్క్ హ్యాచ్‌బ్యాక్, సెయిల్ సెడాన్, సెయిల్ యువా హ్యాచ్‌బ్యాక్, క్రూజ్ ప్రీమియం సెడాన్, తవేరా ఎమ్‌యూవి, ఎంజాయ్ ఎమ్‌యూవి, క్యాప్టివా ప్రీమియం ఎస్‌యూవీలను విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications