గోప్రో కెమెరాకు జీనియన్ ఆల్టర్నేటివ్; ధర రూ.13,000 మాత్రమే

By Ravi

ఖరీదైన గోప్రో కెమెరాలకు ప్రత్యమ్నాయంగా, అత్యంత సరసమైన ధరకే ఓ వైఫై కెమెరా అందుబాటులోకి వచ్చింది. కంప్యూటర్ ఉపకరణాలు, స్మార్ట్ ఫోన్ యాక్ససరీల తయారీ సంస్థ జీనియస్ గోప్రో లాంటి వైఫై కెమెరాను మార్కెట్లో విడుదల చేసింది.

'జీనియస్ లైఫ్-షాట్ ఎఫ్‌హెచ్‌డి300' (Genius Life-Shot FHD300) పేరుతో మార్కెట్లో విడుదలైన ఈ కెమెరా వైఫైని సపోర్ట్ చేస్తుంది. భారత మార్కెట్లో దీని ధర కేవలం రూ.13,000 మాత్రమే. ఈ కెమెరా కూడా గోప్రో మాదిరిగానే హెచ్‌డి వీడియోలు, ఫొటోలను క్యాప్చ్యూర్ చేయగలదు.

Genius Launches GoPro Like WiFi Camera

లైఫ్-షాట్ ఎఫ్‌హెచ్‌డి300 కెమెరా కోసం కంపెనీ వాటర్ ప్రూఫ్ కేసింగ్‌తో పాటు పల రకాల కనెక్టివిటీలను కూడా ఆఫర్ చేస్తుంది. ఈ కెమెరాను సైక్లిస్టులు, మోటారిస్టిలు తమ సైకిల్/బైక్‌లకు అమర్చుకోవచ్చు లేదా తమ హెల్మెట్‌కు అమర్చుకోవచ్చు.

అడ్వెంచర్‌లు చేసే వారు, రేస్‌లలో పాల్గొనే వారు టైమ్-ల్యాప్స్ వీడియోలను ఇందులో చిత్రీకరించుకోవచ్చు. ఈ కెమెరాతో నీటి అడుగున ఉండే దృశ్యాలను కూడా చిత్రీకరించవచ్చు. ఈ కెమెరాలో ఉండే బిల్ట్-ఇన్ వైఫై సాయంతో దీనిని మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

Genius WiFi Camera

ఇందుకోసం ఆండ్రాయిడ్ లేదా ఐఓస్ (యాపిల్) యూజర్లు యాప్ స్టోర్ నుంచి జీనియస్ లైఫ్-షాట్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, తమ స్మార్ట్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.

జీనియస్ లైఫ్-షాట్ ఎఫ్‌హెచ్‌డి300 వైఫై కెమెరాలో 8 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ లెన్స్ ఉంటుంది. ఈ కెమెరా బైక్ మౌంట్, ట్రైపాడ్ మౌంట్, క్లిప్ స్ట్రాప్ మరియు ఐపిఎక్స్8 సర్టిఫైడ్ వాటర్‌ప్రూఫ్ కేస్‌తో లభిస్తుంది. దీనిని యూఎస్‌బి ద్వారా చార్జ్ చేసుకోవచ్చు.

Genius Camera

More from DriveSpark

Article Published On: Friday, December 26, 2014, 9:51 [IST]
English summary
Computer peripherals and smart phone accessories manufacturer, Genius, has launched its mini WiFi camera called Life-Shot FHD300 at Rs 13,000. This GoPro alternative lets users take videos, photos and create time-lapse videos in all scenarios.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+