కారు కోసం రుణం కాదు, కారు ఉంటేనే రుణం..!

By Ravi

ఒకప్పుడు కారు కొనడానికి బ్యాంకులు రుణాలిచ్చేవి, అయితే ఇప్పుడు అవే బ్యాంకులు కారుంటేనే రుణం ఇస్తామని చెబుతున్నాయి. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందినట్లుగానే, కారును తాకట్టు (సెక్యూరిటీగా) పెట్టి రుణం పొందే స్కీమ్‌ను పరిచయం చేసింది ఓ ప్రముఖ బ్యాంక్.

ఇది కూడా చదవండి: టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ బుకింగ్స్ ఓపెన్

ప్రముఖ యాక్సిస్ బ్యాంక్ ఈ తరహా కార్ ఎగైనెస్ట్ లోన్ స్కీమ్‌ను పరిచయం చేసింది. భారతదేశంలో మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన యాక్సిస్ బ్యాంక్ కారుపై రుణాన్ని మంజూరు చేయనుంది. సెకండ్ హ్యాండ్ కార్లకు ఫైనాన్స్ సౌకర్యం కల్పించడం మరియు కార్లకు రీఫైనాన్స్ చేసే వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు బ్యాంక్ హెడ్ (కన్య్జూమర్ లెండింగ్ అండ్ పేమెంట్స్) జైరామ్ శ్రీధరణ్ చెప్పారు.

New Car

గతంలో బ్యాంక్ నుంచి వాహన రుణం పొంది ఉండి, దానిని పూర్తిగా తిరిగి చెల్లించిన కస్టమర్లకు ఈ రుణాన్ని మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ కస్టమర్లు తమతోనే మరింత కాలం కొనసాగేలా, రుణాన్ని టాప్-అప్ చేయటమే ఉద్దేశ్యంగా ఈ స్కీమ్‌ను అందిస్తున్నామని, ఇలాంటి కస్టమర్ల విషయంలో ఇదివరకే కెవైసి చెక్ చేసి ఉంటాం కాబట్టి రిస్కు తక్కువగా ఉంటుదని ఆయన వివరించారు.

ఇది కూడా చదవండి: మహీంద్రా టూవీలర్స్ నుంచి 4 కొత్త మోడళ్లు

ప్రపంచ దేశాల్లో కారుపై రుణం పొందటం చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఆయా దేశాల్లో బ్యాంకులు ప్రతి ఏటా సగటున రూ.650 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకూ కార్లపై రుణాలు మంజూరు చేస్తుంటాయి. డబ్బు అత్యవసరంగా కావల్సిన వారు ఈ రుణ మొత్తాన్ని తమ అవసరాల కోసం వాడుకోవచ్చు. ఇకపై ఇలాంటి సేవలు యాక్సిస్ బ్యాంక్ ద్వారా మనదేశంలో కూడా అందుబాటులోకి వచ్చాయి.


ఈ రుణం పొందటానికి మీకు కావల్సిందల్లా మీ స్వంత కారు. మీ వద్ద స్వంత కారు ఉంటే, ఆ కారును సెక్యూరిటీగా పెట్టి (కారును బ్యాంకు అధికారులకు అప్పజెప్పాల్సిన అవరసం ఉండదు. కానీ బకాయిలు సరిగ్గా కట్టకపోతే కారును స్వాధీనం చేసుకునే అధికారి వారికి ఉంటుంది) రుణం పొందవచ్చు. ఈ తరహా రుణం పర్సనల్ లోన్ కన్నా తక్కువ వడ్డీకే లభిస్తుంది.

ఈ వీడియో చూశారా.. చిన్న పిల్లల కార్లతో పెద్దవాళ్లు ఆడుకుంటే ఇలానే ఉంటది!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/R7yCCcVJE54?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Monday, July 21, 2014, 16:10 [IST]
English summary
The banks in India are trying new and innovative ways to provide loans to customers. They have now decided to provide loans against cars. Individuals vehicles will be treated as collateral against the loans they wish to acquire. This system of loan against cars in India has begun with Axis Bank.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+