షెవర్లే బ్లాక్‌బస్టర్ ఆఫర్స్‌ని ప్రకటించిన జనరల్ మోటార్స్
ఇయర్ ఎండ్ సేల్‌ను పురస్కరించుకొని కార్ కంపెనీలు తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు డిస్కౌంట్లను ప్రకటించగా, తాజాగా అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న షెవర్లే కాప్టివా మినహా అన్ని ఇతర మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
ఈ డిసెంబర్ నెలలో షెవర్లే కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.55,000 నుంచి రూ.85,000 వరకూ ఆదా చేసుకోవచ్చు. వివిధ మోడళ్లపై షెవర్లే అందిస్తున్న డిస్కౌంట్ల వివరాలు ఇలా ఉన్నాయి:
- షెవర్లే బీట్ - రూ.83,000
- షెవర్లే స్పార్క్ - రూ.68,000
- షెవర్లే క్రూజ్ - రూ.60,000
- షెవర్లే సెయిల్ - రూ.55,000
- షెవర్లే సెయిల్ యూ-వీఏ - రూ.55,000
- షెవర్లే తవేరా - రూ.55,000



Click it and Unblock the Notifications








