రియల్ రోడ్ టెస్టింగ్‌కు సిద్ధమైన గూగుల్ సెల్ఫ్-డ్రైవింగ్ కార్

By Ravi

అంతర్జాల దిగ్గజం గూగుల్ ఈ ఏడాది మే నెలలో డ్రైవర్ రహిత (డ్రైవర్‌లెస్ లేదా సెల్ఫ్ డ్రైవింగ్) ప్రోటోటైప్ కారును ఆవిష్కరించిన సంగతి తెలిసినదే.
కాలిఫోర్నియాకు చెందిన టెక్ దిగ్గజం శాంటా క్లారాతో చేతులు కలిపి గూగుల్ ఈ కాన్సెప్ట్ కారును తయారు చేసింది.

గూగుల్ ఇప్పుడు తమ ప్రోటోటైప్ కారును పబ్లిక్ రోడ్లపై టెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. తాము ఈ శెలవు దినాలను కొత్త సంవత్సరంలో నార్తర్న్ కాలిఫోర్నియాలోని వీధులలో గడపనున్నామని ఈ అటానమస్ కార్ టీమ్ తమ గూగుల్ ప్లస్ నెట్‌వర్క్‌లో పేర్కొంది.

గూగుల్ తయారు చేసిన ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారులో స్టీరింగ్ వీల్, బ్రేక్స్, యాక్సిలరేటర్ ఉండవు. ఇవన్నీ కూడా కారులో ఉండే సాఫ్ట్‌వేర్, మెకానిక్స్ ద్వారా కంట్రోల్ చేయబడుతాయి. కారు పైభాగంలో మరియు ముందు వెనుక భాగాల్లో సెన్సార్లు, హెచ్‌డి సరౌండ్ కెమెరాలను ఇందులో ఉపయోగించారు. వీటి సాయంతో పాటుగా మ్యాప్స్ సాయంతో కారు దానంతట అదే దిశానిర్దేశం చేసుకుంటుంది.

Google Car

ఈ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇందులో కూర్చున్న వారు చేయాల్సిందల్లా రెండు సీట్లకు మధ్యలో ఉన్న స్టార్ట్/స్టాప్ బటన్‌ను ప్రెస్ చేయటమే. గూగుల్ కారు ఇంటీరియర్స్‌ను చాలా సింపుల్‌గా ఉంచారు. ఇందులో ప్యాసింజర్ సీట్ల ముందు కొంత లగేజ్ ఉంచుకునేందుకు స్థలం ఉంటుంది.

కారు ఏ రూట్లో వెళ్తుందో తెలిపేందుకు ఓ పెద్ద స్క్రీన్ ఉంటుంది. ప్రారంభ దశ కావటంతో ఈ డ్రైవర్ రహిత కారును వేగాన్ని గంటకు గరిష్టం 25 మైళ్ల (40 కెఎమ్‌పిహెచ్)కు మాత్రమే పరిమితం చేశారు. అయితే, గూగుల్ కో-ఫౌండర్ సెర్గీ బ్రిన్ తెలిపిన సమాచారం ప్రకారం, భవిష్యత్తులో ప్రొడక్షన్ మోడల్‌ను గరిష్టంగా గంటకు 100 మైళ్ల (160 కెఎమ్‌పిహెచ్) వేగంతో పరుగులు తీసేలా అభివృద్ధి చేయనున్నారు.

ప్రస్తుతం గూగుల్ డ్రైవర్‌లెస్ కారు టెస్టింగ్ దశలో ఉంది. గూగుల్ త్వరలోనే ఇలాంటి 100 ప్రోటోటైప్ కార్లను తయారు చేయనుంది. టెస్టింగ్ దశ విజయవంతంగా పూర్తయ్యి, అన్ని సెక్యూరిటీ సమస్యలు పరిష్కరించబడినట్లయితే, మరో రెండేళ్లలోనే ఇవి మనకు అందుబాటులోకి వస్తాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, December 24, 2014, 9:39 [IST]
English summary
Google announced that its first fully functioning self-driving car is ready to be road tested. It will be driving the streets of California in the new year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+