సరికొత్త మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ ఆటోమేటిక్ వస్తోంది

By Ravi

జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి మోటార్స్ భారత మార్కెట్లో హిందుస్థాన్ మోటార్స్‌తో కలిసి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, మిత్సుబిషి మోటార్స్ దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ 'పాజెరో స్పోర్ట్'లో ఓ అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. హిందుస్థాన్ మోటార్స్ విడుదల చేయనున్న ఈ కొత్త పాజెరో స్పోర్ట్ ఎస్‌యూవీ కొత్త ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానుంది. ఇది రానున్న ఆర్థిక సంవత్సరంలో విడుదల కానుంది.

కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ తొలిసారిగా 2012లో సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత హిందుస్థాన్ మోటార్స్ చెన్నైలోని తిరువళ్లూర్ ప్లాంట్‌లో స్థానికంగా అసెంబ్లింగ్ చేయటం ప్రారంభించింది. మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ ఎస్‌యూవీలో 2.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

Mitsubishi Pajero Sport

ఈ ఇంజన్ గరిష్టంగా 178 బిహెచ్‌పిల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ కంపెనీ యొక్క సూపర్ సెలక్ట్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది. ఈ సిస్టమ్ ద్వారా ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది. కాగా.. గడచిన జనవరి నెలలో మిత్సుబిషి ఓ యానివర్స్‌రే ఎడిషన్ పాజెరో స్పోర్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. అయితే, ఇదే సమయలో అవుట్‌లాండర్, సెడియా స్పోర్ట్స్, ఎవల్యూషన్ ఎక్స్ మోడళ్లను మార్కెట్ నుంచి తొలగించింది.

మిత్సుబిషి నుంచి రానున్న ఈ కొత్త పాజెరో స్పోర్ట్ ఆటోమేటిక్ కారులో ఐఎన్‌విసిఎస్-2 '5-స్పీడ్ ఆటో విత్ స్పోర్ట్రానిక్' గేర్‌బాక్సును ఉపయోగించనున్నారు. అయితే, ఇంజన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. ఈ మోడల్‌ను ఇప్పటికే, థాయ్‌లాండ్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. కాగా.. ఈ సంవత్సరంలో మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ ఆటోమేటిక్‌తో పాటుగా 2014 అవుట్‌లాండర్ మోడల్‌ను కూడా విడుదల చేయనున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, January 13, 2014, 10:17 [IST]
English summary
Hindustan Motors will be launching the Pajero Sport with an automatic transmission next fiscal. It was announced during an annual general body meeting. The Pajero Sport is available in a 2.5-liter diesel engine, which is paired to a 5-speed manual transmission. The SUV produces 178 bhp and 400 Nm of torque. The car also features Mitsubishi's Super Select 4WD system.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+