1 లక్ష మైలురాయిని అధిగమించిన హోండా అమేజ్ సేల్స్

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఏప్రిల్ 2013 భారత మార్కెట్లో విడుదల చేసిన తమ కాంపాక్ట్ సెడాన్ 'హోండా అమేజ్' అప్పుడే లక్ష యూనిట్ల అమ్మకాల మార్కును చేరుకుంది. మార్కెట్లో విడులైన కేవలం 16 నెలల్లోనే అమేజ్ ఈ రికార్డును సాధించింది. హోండాకు ఇది మొదటి డీజిల్ కారు, మొదటి కాంపాక్ట్ సెడాన్ కావటంతో దీని అమ్మకాలు జోరందుకున్నాయి.

ఇది కూడా చదవండి: హోండా మొబిలియో ఆర్ఎస్ అఫీషియల్ డిటేల్స్

ఈ సందర్భంగా హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ మాట్లాడుతూ.. హోండా అమేజ్ భారత మార్కెట్లో మంచి విజయం సాధించడం తమకెంతో సంతోషంగా ఉందని, కొత్త రకం వినియోగదారులను చేరుకునేందుకు ఈ మోడల్ తమకెంతగానో ఉపయోగపడిందని, అమేజ్ ద్వారా తాము డీజిల్ కార్ సెగ్మెంట్లోకి ప్రవేశించామని, భవిష్యత్తులో ఈ మోడల్ మరింత వృద్ధిని కనబరచగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Honda Amaze

ఇక హోండా అమేజ్ సెడాన్ విషయానికి వస్తే.. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ప్రీటెన్షనర్ సీట్ బెల్ట్స్, ధృఢమైన బాడీ నిర్మాణం వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి.

ఇది కూడా చదవండి: కొత్త కారులో తప్పనిసరిగా ఉండాల్సిన 10 ఫీచర్లు

అన్ని డీజిల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లలో ఈబిడితో కూడిన ఏబిఎస్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తున్నారు. ఇది ఆరు ఆకర్షనీయమైన రంగులలో (మెజిస్టిక్ బ్లూ మెటాలిక్, కార్నెలియన్ రెడ్ పెరల్, అర్బన్ టైటానియం మెటాలిక్, అల్బాస్టర్ సిల్వర్ మెటాలిక్, క్రిస్టల్ బ్లాక్ పెరల్ మరియు టఫేటా వైట్) లభిస్తుంది. దీని వారంటి రెండేళ్లు లేదా 40,000 కి.మీ.

More from DriveSpark

Article Published On: Friday, August 8, 2014, 14:30 [IST]
English summary
Honda Cars India Ltd. (HCIL) today announced that its family sedan Honda Amaze has crossed the 1 lakh sales milestone. The compact family sedan clocked phenomenal sales since its launch in April 2013 thus crossing this milestone in just 16 months and fastest in HCIL history since its inception in the Indian market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+