గిన్నిస్ బుక్ ఎక్కిన హోండా అమేజ్ లాంగెస్ట్ డ్రైవ్

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్), భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ మొట్టమొదటి కాంపాక్ట్ సెడాన్ 'హోండా అమేజ్' (Honda Amaze) సక్సెస్‌ను పురస్కరించుకొని, కంపెనీ 'హోండా అమేజ్ లాంగెస్ట్ డ్రైవ్ థ్రూ అమేజింగ్ ఇండియా' పేరిట ఓ ప్రత్యేక రోడ్ ట్రిప్ కార్యక్రమాన్ని గడచిన సెప్టెంబర్ 15వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసినదే.

ఈ అడ్వెంచర్ రోడ్ ట్రిప్‌లో భాగంగా, డీజిల్ వెర్షన్ హోండా అమేజ్ కారు ఇప్పటి వరకూ భారతదేశంలోని 400 నగరాలు/పట్టణాలను కవర్ చేస్తూ మొత్తం 23,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. జోధ్‌పూర్ నుంచి ప్రారంభమైన హోండా అమేజ్ లాంగెస్ట్ డ్రైవ్ థ్రూ అమేజింగ్ ఇండియా ట్రిప్ ఢిల్లీలో ముగిసింది. ఈ రోడ్ ట్రిప్‌ను గిన్నిస్ బుక్ కూడా అధికారికంగా గుర్తించింది.


హోండా కార్స్ ఇండియా మరో అరుదైన మైలురాయిని చేరుకుందని, ఒకే దేశంలో కారు ద్వారా అత్యధిక దూరం ప్రయాణించినందుకు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఈ గుర్తింపును అందజేసిందని తెలియజేయటానికి తమకెంతో సంతోషంగా ఉందని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈఓ హిరోనోరీ కనయమా తెలిపారు.

భారతదేశంలోని వివిధ రకాల రోడ్లపై తమ హోండా అమేజ్ పనితనాన్ని, ధృఢత్వాన్ని, నాణ్యతను మరియు విశ్వసనీయతను ఈ రోడ్ ట్రిప్ ప్రతిభింభింపజేస్తుందని ఆయన చెప్పారు. పర్వతాలు, ఘాట్ రోడ్లు, సముద్ర తీరప్రాంతాలు, జాతీయరహదారులు, రద్దీగా ఉండే నగరాలు, పట్టణాల గుండా హోండా అమేజ్ లాంగెస్ట్ డ్రైవ్ థ్రూ అమేజింగ్ ఇండియా రోడ్ ట్రిప్ సాగిపోయింది.

Honda Amaze Drives Into Guinness World Records

హోండా అమేజ్ లాంగెస్ట్ డ్రైవ్ థ్రూ అమేజింగ్ ఇండియాకు సంబంధించి త్వరలోనే ఓ వెబ్‌సైట్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్ క్యాంపైన్‌కు చేతన్ భగత్ (రచయిత) హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ రోడ్ ట్రిప్ సమయంలో తమ కెమరాల్లో బంధించిన అద్భుతమైన దృశ్యాలను, భారతదేశంలోని సుందరమైన ప్రదేశాలను ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 11, 2014, 12:03 [IST]
English summary
Japanese automobile giant Honda had recently begun its ‘Honda Amaze Longest Drive Through Amazing India'. Now it has been confirmed that Honda Cars India have secured a Guinness World Record. They have won a record for the longest journey by a car in a single country. Honda's family sedan Amaze has travelled across 400 towns accomplishing 23,800 kilometres across India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+