కొనసాగుతున్న అమేజ్ జోరు: డిసెంబర్‌లో అమేజింగ్ సేల్స్

By Super Admin

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) ఇటీవల విడుదల చేసిన తమ తొలి డీజిల్ కారు హోండా అమేజ్, దేశీయ విపణిలో హాట్ కేకుల్లా అమ్మడుపోతుంది. ఈ సెగ్మెంట్లో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్‌కు గట్టి పోటీ ఇస్తూ, కంపెనీ ఊహించని రీతిలో సక్సెస్‌ను సొంతం చేసుకుంటోంది.ఈ మోడల్, ప్రస్తుతం కంపెనీ నుంచి అమ్ముడుపోతున్న టాప్ మోడల్‍‌గా నిలిచింది.

హోండా అమేజ్ ఎఫెక్ట్‌తో గడచిన డిసెంబర్ నెలలో హోండా కార్స్ ఇండియా అమ్మకాలు ఏకంగా 29.49 శాతం వృద్ధి చెందాయి. డిసెంబర్ 2013 నెలలో దేశీయ విపణిలో మొత్తం 5,493 హోండా కార్లు అమ్ముడుపోయాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 4,242 యూనిట్లుగా ఉన్నట్లు హెచ్‌సిఐఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.

డిసెంబర్ నెలలో 1,026 బ్రయో కార్ల అమ్ముడుపోగా, 4,458 యూనిట్లు అమేజ్ సెడాన్లు అమ్ముడుపోయాయి. అయితే, ఈ నెలలో కేవలం 9 యూనిట్ల అకార్డ్ సెడాన్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి డిసెంబర్ 2013 నెలకు చూస్తే, హోండా మొత్తం అమ్మకాలు మునుపటి సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే 66.39 శాతం వృద్ధి చెంది 51,478 యూనిట్ల నుంచి 85,656 యూనిట్లకు పెరిగాయి.

Honda Car Sales

More from DriveSpark

Article Published On: Friday, January 3, 2014, 20:27 [IST]
English summary
Honda Cars India Ltd posted a 29.49 per cent increase in domestic sales at 5,493 units in December 2013. The company had sold 4,242 units in the same month of the previous year, HCIL said today in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+