ఏప్రిల్ 1వ తేది నుంచి పెరగనున్న హోండా కార్ల ధరలు
హోండా కార్స్ కొనేందుకు ఇదే అనువైన సమయం, ఎందుకంటే వచ్చే నెల ఆరంభం నుంచి అన్ని హోండా కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. ఏప్రిల్ 1, 2014వ తేది నుంచి కంపెనీ ఇటీవలే విడుదల చేసిన సరికొత్త సిటీ సెడాన్‌తో పాటుగా అన్ని హోండా కార్ల ధరలను పెంచనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: హోండా సిటీ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఫుల్ డిటేల్స్
హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ మాట్లాడుతూ.. ఎంత మొత్తంలో ధరలను పెంచాలనే అంశాన్ని కంపెనీ పరిశీలిస్తోందని అన్నారు. హోండా కార్ల ధరలు మోడల్‌ను కొన్ని వేల రూపాయల వరకు పెరిగొచ్చని అంచనా.

గడచిన ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ తర్వాత దాదాపు అన్ని కార్ కంపెనీలు ధరలను తగ్గిస్తుంటే, హోండా కార్స్ ఇండియా మాత్రం ధరలను పెంచడం గమనార్హం.
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ వెర్నాను బీట్ చేసిన హోండా సిటీ
హోండా కార్స్ ఇండియాకు ప్రస్తుతం భారత మార్కెట్లో యూపిలోని గ్రేటర్ నోయిడాలో, రాజస్థాన్‌లోని తపుకరాలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్లలో కంపెనీ సిఆర్-వి, సిటీ, అమేజ్, బ్రయో కార్లను ఉత్పత్తి చేస్తోంది.


Click it and Unblock the Notifications








