భారతదేశంలో హోండా 200వ డీలర్‌షిప్ ప్రారంభం
జపనీస్ కార్ కంపెనీ హోండా, భారత మార్కెట్లోని కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు తన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తృతంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే, కంపెనీ భారతదేశంలో తమ 200వ కార్ షోరూమ్‌ను తెలంగాణా రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లో ప్రారంభించింది.
సికింద్రాబాద్‌లో 200వ డీలర్‌షిప్‌ను హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ హిరోనోరి కనయమ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న 16 నెలల్లో మరో 100 డీలర్లను తమ నెట్‌వర్క్‌లోకి చేర్చుకోనున్నామని చెప్పారు.
ప్రస్తుతం హోండా కార్స్ ఇండియాకు ఆంధ్రప్రదేశ్‌లో 7, తెలంగాణలో 7 షోరూమ్‌లు ఉన్నాయి. కాగా.. 2017 నాటికి భారతదేశంలో సాలీనా మూడు లక్షల కార్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్ నాటికి కార్ల అమ్మకాలు 43 శాతం పెరిగి 1.01 లక్షలకు చేరాయని ఆయన తెలిపారు.



Click it and Unblock the Notifications








