ఏప్రిల్ నెలలోను జోరుగా సాగిన హోండా కార్ల అమ్మకాలు

By Ravi

అమేజ్, 2014 సెడాన్లతో డీజిల్ కార్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టిన జపనీస్ కార్ బ్రాడ్ హోండా కార్స్ ఇండియా ఇప్పుడు మార్కెట్లో మంచి జోరు మీదుంది. హోండా డీజిల్ కార్లకు మంచి డిమాండ్ నెలకొనడంతో, గడచిన సంవత్సరం ఏప్రిల్ నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అమ్మకాలు జోరుగా సాగాయి.

ఏప్రిల్ 2013లో హోండా మొత్తం 8,488 కార్లను విక్రయించగా, ఏప్రిల్ 2014లో 11,040 కార్లను విక్రయించి 30 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. కాగా.. గడచిన ఏప్రిల్ నెలలో హోండా మొత్తం 402 కార్లను ఎగుమతి చేసింది. ఇందులో అధికంగా అమేజ్, సిటీ మోడళ్లే ఉన్నాయి.

ఈ విషయంపై హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పి జ్ఞానేశ్వర్ సేన్ మాట్లాడుతూ.. 2014-15 ఆర్థిక సంవత్సరం చాలా సానుకూలంగా ప్రారంభమైందని, కొత్త హోండా సిటీ సెడాన్ పట్ల ఆసక్తి కనబరిచిన కస్టమర్లందరికీ తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

Honda Sales

హోండా అమేజ్‌ను విడుదల ఒక ఏడాది పూర్తయిన నేపథ్యంలో, ఈ మోడల్ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకున్నామని, ఈ సందర్భంగా ఓ వార్షికోత్సవ ఎడిషన్‌ను కూడా ఇందులో ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు.

గడచిన నెలలో మోడల్ వారీ హోండా కార్ల అమ్మకాలు క్రింది విధంగా ఉన్నాయి:
హోండా సిటీ - 7,044 యూనిట్లు
హోండా అమేజ్ - 3,355 యూనిట్లు
హోండా బ్రియో - 578 యూనిట్లు
హోండా సిఆర్-వి 63 యూనిట్లు
ఎగుమతులతో కలిపి ఏప్రిల్ 2014లో మొత్తం అమ్మకాలు - 11,442 యూనిట్లు

More from DriveSpark

Article Published On: Friday, May 2, 2014, 14:15 [IST]
English summary
Honda Cars India has continued its good performance in a tough market with a growth of 30 percent during the previous month of April 2014. The company managed to sell 11,040 cars during the month, most of which were Honda City and Honda Amaze models. In comparison, Honda had only sold 8,488 cars during the corresponding month last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+