సిటీ సెడాన్‌తో అద్భుతాలు సృష్టిస్తున్న హోండా కార్స్

By Ravi

ఒకప్పుడు మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో రాజ్యమేలిన హోండా సిటీ, ఆ తర్వాతి కాలంలో ఆటోమొబైల్ మార్కెట్లో వచ్చిన అనేక కొత్త మోడళ్లు, పెరుగుతున్న పెట్రోల్ ధరలు, డీజిల్ వెర్షన్ సిటీ అందుబాటులో లేకపోవటం, అదే పాత డిజైన్ వంటి అనేక కారణాల వలన క్రమంగా ఈ మోడల్ హవా తగ్గిపోయింది. అయితే, హోండా కార్స్ ఇండియా, ఇటీవలే తమ సిటీ సెడాన్ అధునాతంగా తయారు చేసి, ఇందులో డీజిల్ వెర్షన్‌ను కూడా ఆఫర్ చేయడంతో మళ్లీ ఈ మోడల్‌కు పూర్వవైభవం లభించింది.

గడచిన జనవరి నెల అమ్మకాలే ఇందుకు నిదర్శనం. హోండా కార్స్ ఇండియాకు ఇప్పుడు అమేజ్, సిటీ మోడళ్లు రెండు కళ్లు. మార్కెట్లో ఈ మోడళ్లు అద్భుతాలు చేస్తున్నాయి. హోండా సిటీ జనవరి 7, 2014న మార్కెట్లో విడుదలైంది. ఒక నెల కన్నా తక్కువ వ్యవధిలోనే హోండా 7,184 సిటీ కార్లను విక్రయించింది. హోండా కార్స్ ఇండియా గడచిన జనవరి 2014 నెలలో మొత్తం 15,174 కార్లను విక్రయిస్తే, అందులో 7,184 సిటీ కార్లే ఉన్నాయంటే, ఈ మోడల్ ఎంతగా సక్సెస్‌ను సాధించిందో తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: 2014 హోండా సిటీ సెడాన్ రివ్యూ


గడచిన సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే, అమ్మకాల వృద్ధి 188 శాతం ఎక్కువగా ఉంది. జనవరి 2013లో హోండా మొత్తం అమ్మకాలు కేవలం 5451 యూనిట్లు మాత్రమే. అంతేకాకుండా, కంపెనీ తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హోండా కార్స్ ఇండియా మొట్టమొదటిసారిగా అమ్మకాల్లో లక్ష మార్కును చేరుకుంది. ఏప్రిల్ 2013 నుంచి జనవరి 2014 కాలంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 1,01,370 యూనిట్లుగా నమోదయ్యాయని, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో మొత్తం అమ్మకాలు 56,929 యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Monday, February 3, 2014, 9:46 [IST]
English summary
Despite what the overall state of the automobile industry in India is, which is said to be in a low according to analysts, Honda cars India has continued to fly above the clouds. The Amaze compact sedan was its star car last year, selling in great numbers and helping the automaker grow.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+