హోండా సిటీ విడుదల: ఫీచర్లు, సేఫ్టీ ఫీచర్లు, రంగులు, ధరలు

By Ravi

హోండా కార్స్ ఇండియా తమ లేటెస్ట్ డీజిల్ కార్ '2014 హోండా సిటీ'ని దశల వారీగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ కారును ఢిల్లీలో విడుదల చేసిన తర్వాత తాజాగా ముంబైలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మా డ్రైవ్‌స్పార్క్ బృందం కూడా హాజరయ్యింది. ఈ సందర్భంగా, కంపెనీ తమ కొత్త కారుకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

హోండాకు భారత్‌లో ఇది రెండవ డీజిల్ కారు (మొదటిది హోండా అమేజ్). దేశీయ విపణిలో కొత్త హోండా సిటీ ప్రారంభ ధరలు రూ.7.42 లక్షలు (పెట్రోల్ మ్యాన్యువల్ వేరియంట్), రూ.8.62 లక్షలు (డీజిల్ మ్యాన్యువల్ వేరియంట్)గా ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌ను, డీజిల్ వెర్షన్ 1.5 లీటర్ ఐ-డిటెక్ (అమేజ్‌లో ఉపయోగించినది) ఇంజన్‌ను ఉపయోగించారు.


పెట్రోల్ వెర్షన్లో ఉపయోగించిన 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ 119 పిఎస్‌ల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 17.8 కి.మీ. మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ 17.9 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

డీజిల్ వెర్షన్లో అధునాతన 1.5 లీటర్ ఐ-డిటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 100 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 26 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

సేఫ్టీ ఫీచర్లు:
* పెడస్ట్రియన్ ఇంజూరీ మిటిగేషన్ టెక్నాలజీ
* డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్
* యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) (అన్ని డీజిల్, సివిటి వేరియంట్లలో స్టాండర్డ్)
* ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి) (అన్ని డీజిల్, సివిటి వేరియంట్లలో స్టాండర్డ్)
* ఇంపాక్ట్ మిటిగేషన్ హెడ్‌రెస్ట్స్ (మెడ భాగంలో గాయాలు కాకుండా ఉండేందుకు)


ఫీచర్లు:
* టచ్‌స్క్రీన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ (సెగ్మెంట్లోని తొలి ఫీచర్)
* అధునాతన ఆడియో సిస్టమ్ (8 స్పీకర్లు, 5 ఇంచ్ స్క్రీన్)
* వన్ పుష్ ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్ (హోండా స్మార్ట్ కీ సిస్టమ్‌తో)
* స్టీరింగ్ వీల్‌పై ఆడియో, హ్యాండ్స్ ఫ్రీ, క్రూయిజ్ కంట్రోల్ బటన్స్
* రియర్ ఏసి వెంట్స్ మరియు రియర్ పార్కింగ్ కెమెరా (విభిన్న యాంగిల్స్‌లో)
* ఎక్స్టీరియర్ ఫీచర్లలో సెగ్మెంట్లో కెల్లా తొలిసారిగా షార్క్ ఫిన్ యాంటీనా, సన్‌రూఫ్, ఫాగ్ ల్యాంప్స్, అవుట్‌సైడ్ మిర్రర్ అండ్ డోర్ మౌంటెడ్ టర్న్ ఇండికేటర్ ల్యాంప్స్

కలర్లు:
* గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్ (కొత్త ఎక్స్‌క్లూజివ్ కలర్)
* కార్నెలియన్ రెడ్ పెరల్
* అర్బన్ టైటానియం మెటాలిక్
* ఆల్బాస్టర్ సిల్వర్ మెటాలిక్
* క్రిస్టల్ బ్లాక్ పెరల్
* టఫ్ఫెటా వైట్

Honda City Diesel 2014

హోండా సిటీ పెట్రోల్ ధరలు:
* ఈ ఎమ్‌టి - రూ. 7.42 లక్షలు
* ఎస్ ఎమ్‌టి - రూ. 8.04 లక్షలు
* ఎస్‌వి ఎమ్‌టి - రూ. 8.49 లక్షలు
* వి ఎమ్‌టి - రూ. 8.99 లక్షలు
* విఎక్స్ ఎమ్‌టి - రూ. 9.93 లక్షలు
* ఎస్ఎక్స్ ఏటి - రూ. 9.49 లక్షలు
* విఎక్స్ ఏటి - రూ. 10.98 లక్షలు

హోండా సిటీ డీజిల్ ధరలు:
* ఈ ఎమ్‌టి - రూ. 8.62 లక్షలు
* ఎస్ ఎమ్‌టి - రూ. 9.24 లక్షలు
* ఎస్‌వి ఎమ్‌టి - రూ. 9.66 లక్షలు
* వి ఎమ్‌టి - రూ. 10.16 లక్షలు
* విఎక్స్ ఎమ్‌టి - రూ. 11.10 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)

More from DriveSpark

Article Published On: Friday, January 10, 2014, 9:27 [IST]
English summary
Followed by its launch in the capital city of New Delhi, Honda today launched the City sedan in Mumbai. Honda City is available for a starting price of INR 7.42 lakhs for the petrol manual variant and INR 8.62 lakhs for the diesel manual variant. The CVT variant starts at INR 9.49 lakhs. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+