హోండా నుంచి అప్పుడే లక్ష డీజిల్ కార్లు అమ్ముడయ్యాయ్!

By Ravi

జపనీస్ కార్ కంపెనీ హోండా, డీజిల్ కార్ సెగ్మెంట్లో లేట్‌గా ప్రవేశింటినప్పటికీ, లేటెస్ట్ వండర్స్‌ను క్రియేట్ చేస్తోంది. భారత్‌లో హోండా కార్స్ ఇండియా మొట్టమొదటి సారిగా అమేజ్ సెడాన్‌తో డీజిల్ వెర్షన్ కారును విడుదల చేసింది. ఆ తర్వాత పాపులర్ హోండా సిటీలో డీజిల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. తాజాగా విడుదల చేసిన మొబిలియోలో కూడా కంపెనీ డీజిల్ వెర్షన్‌ను ఆఫర్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: 2014 హోండా సిటీ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - రివ్యూ

హోండా అందిస్తున్న ఈ మూడు డీజిల్ కార్లలోను సరికొత్త 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకూ హోండా మొత్తం లక్ష డీజిల్ కార్లను (మూడు మోడళ్లు కలిపి) భారత్‌లో విక్రయించింది. కంపెనీకి అందిన సర్వీస్ డేటా ప్రకారం, అమేజ్, సిటీ, మొబిలియో కార్లు మూడు కలిసి సుమారు 90 కోట్ల కిలోమీటర్లకు పైగా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది.


గడచిన సంవత్సరం (2013) ఏప్రిల్ నెలలో హోండా అమేజ్ సెడాన్‌తో కంపెనీ తమ 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్‌ను భారత్‌కు పరిచయం చేసింది. ఆ తర్వాత జనవరి 2014లో విడుదల చేసిన హోండా సిటీలోను మరియు జులై 2014లో విడుదలైన హోండా మొబిలియో ఎమ్‌పివిలోను ఈ ఇంజన్‌ను ఉపయోగించారు.

ఈ కొత్త 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్ మైలేజ్ మోడల్‌ను బట్టి వేర్వేరుగా ఉంటుంది. హోండా సిటీలోని ఇంజన్ లీటరుకు గరిష్టంగా 26 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తే, హోండా అమేజ్‌లోని ఇంజన్ 25.8 కిలోమీటర్ల మైలేజీని మరియు హోండా మొబిలియోలోని ఇంజన్ లీటరుకు 24.5 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది (అన్ని గణాంకాలు కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం).

More from DriveSpark

Article Published On: Thursday, August 21, 2014, 16:26 [IST]
English summary
Honda Cars India Ltd. (HCIL) has announced that it has sold more than 1 lakh cars powered by its revolutionary 1.5L i-DTEC diesel engine in the country. The diesel variants of the Honda Amaze, Honda City and Honda Mobilio have clocked over 90 crore kms cumulatively as per service data. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+