జమ్మూ కాశ్మీర్ వరద బాధితుల కోసం రూ.3 కోట్లు: హోండా

By Ravi

జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఇటీవల సంభవించిన వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హోండా ముందుకొచ్చింది. జమ్మూ అండ్ కాశ్మీర్‌లో జరుగుతున్న పునరావాస కార్యకలాపాల కోసం కెపనీ మూడు కోట్ల రూపాయలను దానం చేసింది.

వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీ ముందుకొచ్చాయి. ఈ జాబితాలో తాజాగా హోండా రూ.3 కోట్ల విలువైన చెక్కులను ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు దానం చేసింది. ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి హోండా మోటార్ కంపెనీ మేనేజింగ్ ఆఫీసర్, సీఈఓ, ప్రెసిడెంట్ యోషియుకి మట్సుమోటో తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

భారత్‌లోని హోండా గ్రూపు కంపెనీలైన హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హోండా సియోల్ పవర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, హోండా ఆర్ అండ్ డి (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, హోండా మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కలిసి ఈ మొత్తాన్ని సమీకరించాయి.

Honda Donate 3 Crores for Jammu And Kashmir Flood Relief

More from DriveSpark

Article Published On: Wednesday, September 24, 2014, 16:26 [IST]
English summary
Honda Motor Company, the Japanese multinational automobile manufacturer has contributed INR 3 crores towards the relief and recovery efforts in Jammu & Kashmir.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+