2014 ప్యారిస్ మోటార్ షో: హోండా హెచ్ఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యూవీ
జపనీస్ కార్ కంపెనీ హోండా కూడా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే, ఫ్రాన్స్‌లో జరుగుతున్న 2014 ప్యారిస్ మోటార్ షోలో హోండా ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఈ కాన్సెప్ట్ పేరు హోండా హెచ్ఆర్-వి.
కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గిరాకీ ఎక్కువగా మార్కెట్లను (ప్రత్యేకించి భారత మార్కెట్‌ను) లక్ష్యంగా చేసుకొని హోండా తమ హెచ్ఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. హోండా అందిస్తున్న ఫుల్-సైజ్డ్ ఎస్‌యూవీ సిఆర్-వి నుంచి స్ఫూర్తి పొంది ఈ హెచ్ఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యూవీని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

హోండా హెచ్ఆర్-వి డిజైన్ చూడటానికి సిఆర్-వి మాదిరిగానే అనిపిస్తుంది. రీటైల్ మరియు కార్పోరేట్ కస్టమర్లను ఆకట్టుకునేలా తమ కొత్త హెచ్ఆర్-వి కారును డిజైన్ చేశామని ఈ కారు హెడ్ లియోన్ బ్రన్నన్ తెలిపారు. వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి హోండా హెచ్ఆర్-వి ప్రొడక్షన్ వెర్షన్ తొలుతగా యూరోపియన్ మార్కెట్లలో విడుదల కానుంది.
ఆ తర్వాత దశల వారీగా పలు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా లభ్యం కానుంది. భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో, హోండా తమ హెచ్ఆర్-వి మోడల్‌ను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసే అవకాశాలున్నాయి.

హోండా హెచ్ఆర్-వి ఈ సెగ్మెంట్లో రెనో డస్టర్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్, నిస్సాన్ టెర్రానో వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు పోటీగా నిలిచే అవకాశం ఉంటుంది. కాగా.. హోండా తమ హెచ్ఆర్-వి మోడల్‌కు సంబంధించిన సాంకేతిక, ఇతర వివలాను ఇంకా వెల్లడించలేదు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








