తగ్గనున్న హోండా సిటీ సెడాన్ వెయిటింగ్ పీరియడ్!

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా కార్స్ ఇండియా, ఈ ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త 2014 హోండా సిటీ సెడాన్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో పాటుగా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యం అవుతుండటంతో, మార్కెట్లో ఈ మోడల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

ఈ మోడల్ ఉత్పత్తి సామర్థ్యానికి మించి డిమాండ్ వస్తుండటంతో, దీని వెయిటింగ్ పీరియడ్ కూడా అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో హోండా సిటీ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

సిటీ సెడాన్‌ను రాజస్థాన్‌లో ఉన్న తపుకరా ప్లాంట్‌లో హోండా ఉత్పత్తి చేస్తోంది. ఈ మోడల్ డిమాండ్‌కు అనుగుణంగా సప్లయ్ సజావుగా సాగేందుకు వీలుగా ఈ ప్లాంట్‌లో సిటీ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ప్లాంట్‌లో ప్రస్తుతం నెలకు 5,000 సిటీ కార్లు ఉత్పత్తి అవుతుంటే, ఇప్పుడు ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 10,000 యూనిట్లకు పెంచారు.

honda city waiting period

భారత మార్కెట్లో హోండా సిటీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా, మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే) ఆప్షన్లతో కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం హోండా అందిస్తున్న సిటీ సెడాన్ 4వ తరానికి చెందినది (ఫోర్త్ జనరేషన్)

పెట్రోల్ వెర్షన్ సిటీలో ఉపయోగించిన 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ 119 పిఎస్‌ల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 17.8 కి.మీ. మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ 17.9 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

డీజిల్ వెర్షన్ హోండా సిటీలో అధునాతన 1.5 లీటర్ ఐ-డిటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 100 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 26 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Saturday, November 8, 2014, 15:18 [IST]
English summary
Honda has now decided to double its production output of City from its facility in Tapukara, Rajasthan. Every month the Japanese manufacturer was assembling 5,000 vehicles, however, they will now be producing 10,000 vehicles in a single month.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+